లిఫ్ట్ లోపల అలాంటి ఏర్పాట్లు..తెలిస్తే షాకవ్వాల్సిందే.?

FARMANULLA SHAIK
ప్రస్తుతం లిఫ్ట్‌ల వినియోగం అనివార్యంగా మారింది. ఒకప్పుడు పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్‌లో మాత్రమే లిఫ్ట్స్‌ అందుబాటులో ఉండేవి. అయితే తర్వాత చిన్న చిన్న బిల్డింగ్స్‌లో కూడా లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక మనం చూసే చాలా వరకు లిప్టుల్లో అద్దాలు ఉండడం గమనించే ఉంటాం. అయితే లిఫ్టుల్లో అద్దాలను ఎందుకు ఏర్పాటు చేస్తారన్న దానిపై ఆసక్తి ఉండడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో సాధారణంగా ప్రజలు లిఫ్టుల్లోని అద్దాల్లో తమ ముఖం చూసుకుంటూ, జుట్టు సరి చేసుకుంటుంటారు. లేదా డ్రెస్ సర్దుకుంటారు. కానీ లిఫ్ట్‌లో మిర్రర్స్ అమర్చడానికి వెనుక చాలా ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. అసలు లిఫ్టులో అద్దాన్ని ఏర్పాటు చేయడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా లిఫ్టుల్లో వెళ్లేటప్పుడు ఏదో తెలియని భయం ఉంటుంది. మనకు తెలియని వ్యక్తులు ఒక చోట చేరడంతో ఆందోళన కలగడం సర్వసాధారణం. అయితే ఆ సమయంలో లిఫ్టులో ఉన్న అద్దం మన దృష్టిని మరలకుండా చేస్తుంది. మన ఏకాగ్రత అంతా అద్దంపై ఉంటుంది. దీంతో ఆందోళన, భయం వంటివి దూరమవుతాయి. ఇక లిఫ్టులో అద్దం పెట్టడానికి మరో కారణం లిఫ్టు వేగం.సాధారణంగా లిఫ్ట్‌ వేగంతో వెళ్తుంది. ఈ వేగం కారణంగా చాలా మంది భయడుతుంటారు. అయితే లిఫ్టులో ఉండే అద్దం కారణంగా భయం దూరమవుతుంది. ఇక లిఫ్టులో గాలి తక్కువగా ఉండడం, ఫ్రెష్ ఎయిర్‌ లేకపోవడం కారణంగా క్లాస్ట్రోఫోబియా సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య ఎదురైన సమయంలో మనలో ఆందోళన పెరుగుతుంది, గుండె వేగం పెరుగుతుంది. అరచేతిలో చెమటలు పడుతుంటాయి.  లిఫ్ట్ లో అద్దం ఉండడం, దాని చూడటం వల్ల  ఇలాంటి ఆందోళనలు దూరమవుతాయి. అంతేకాదు అవసరాన్ని మించి ఎవరైనా లిఫ్ట్ ఎక్కినా ఇరుకుగా ఉందనే భావన కలగకుండా చేస్తుంది.లిఫ్టుల్లో తొలిసారి అద్దాలను మొదటిసారి జపాన్ దేశం ప్రవేశపెట్టింది. లిఫ్టులను ఉపయోగించే వికలాంగుల కోసం అద్దాలను ఏర్పాటు చేశారు. సాధారణంగా వీల్‌ చైర్‌లో కూర్చొని వెనక్కి తల తిప్పడం కష్టంగా ఉంటుంది. దీంతో వీల్ చెయిర్‌ను వెనక్కి తిప్పే సమయంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అదే లిఫ్టులో అద్దం ఉంటే వెనకాల నుంచి ఎవరు వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. దీంతో వెనక్కి తిరిగి చూడకుండానే చెయిర్ ను తిప్పొచ్చు.ఇదిలావుండగా లిఫ్ట్‌లు ఎలా ఉండాలో తెలియజేసేందుకు ప్రత్యేక గైడ్‌లైన్స్‌ రూపొందించారు. అసోసియేషన్ చెప్పే రూల్స్ ప్రకారం, ప్రతి లిఫ్ట్‌లో అద్దం ఉండాలి. ఈ మిర్రర్స్ లిఫ్టులను మరింత అందంగా కూడా మార్చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: