బంజారాహిల్స్ టాస్ పబ్ కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. అనుమతులు లేకుండా పబ్ నడుపుతున్న యజమాన్యం రెస్టారెంట్ అండ్ బారు పర్మిషన్ తీసుకొని పబ్బు నడుపుతున్నారు. పబ్బులో డాన్స్ ఫ్లోర్ ను ఏర్పాటు చేసి డబ్బులు లాగుతున్న నిర్వాకులు కస్టమర్లకు అమ్మాయిలను ఎరగా వేసి బిజినెస్ చేస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించినందుకు అమ్మాయిలకు కమిషన్ ఇస్తున్న యాజమాన్యం.. ఒక్కొక్క అమ్మాయికి ఐదు నుంచి పదివేల రూపాయలు చెల్లిస్తున్నారు. అమ్మాయిలు చేత అర్ధనగ్న డాన్సులు చేయించి డబ్బులు వసూలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులకు వచ్చిన సమాచారంతో శుక్రవారం అక్టోబర్ 18న రోజున అర్ధరాత్రి 12 గంటలకు టాస్ పబ్ మీద పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఊగిపోతున్న యువకులు, అర్ధనగ్న రీతిలో నృత్యాలు చేస్తున్న యువతులను పోలీసులు గమనించారు. మొత్తం 100 మంది యువకులతో పాటు 42 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ పబ్‌ను సీజ్ చేసిన పోలీసులు పట్టుబడినవారందరికీ నోటీసులు జారీ చేశారు.ఈ కేసులో పోలీసులు విచారణ జరపగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈమేరకు బంజారాహిల్స్ ఏసీపీ వెంకట్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.టాస్ పబ్‌లో కొంతకాలంగా.. అమ్మాయిలను ఎరగా వేస్తూ.. అబ్బాయిలను ఆకర్షిస్తూ ఎక్కువ మద్యం తాగేలా చేసి అందినకాడిన దండుకుంటున్నట్టుగా ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. దీంతో దాడి చేసి పబ్ యజమానులు ఉప్పల్‌కు చెందిన డింగి బలరామ్‌గౌడ్, జగద్గిరిగుట్టకు చెందిన డింగి శ్రీనివాస్‌గౌడ్, మేనేజర్ అలీం, బార్ టెండర్ రామకృష్ణపై కేసులు నమోదు చేయగా పబ్ యజమానులు బలరాంగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌లు పరారీలో ఉన్నట్టు చెప్తున్నారు. కాగా దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూసినట్టు వివరించారు.అసలు టాస్ పబ్‌కు ఎలాంటి అనుమతి లేదని తేలింది. కాగా పబ్‌కు వచ్చిన అబ్బాయిలకు అమ్మాయిలను ఎరగా వేస్తున్నారు. అబ్బాయిలపై వలపు వల విసురుతూ వెర్రెత్తిస్తూ ఎక్కువ మద్యం తాగించేందుకు అమ్మాయిలను నియమించుకున్నారు. ఓ కస్టమర్‌ను రెచ్చగొడుతూ ఎంత ఎక్కువ బిల్లు చేయిస్తే అంత కమిషన్ ఇచ్చేలా డీల్ మాట్లాడుకుంటున్నారు. అమ్మాయిలకు కురచ దుస్తులు వేసి.. వారితో చనువుగా ఉండేలా ప్రోత్సహిస్తున్నారు. అందుకు రకరకాల ఓపెన్ ఆఫర్లు కూడా పెట్టారు. అమ్మాయి పక్కన కూర్చుంటే రూ.500 మీద చెయ్యి వేస్తే రూ.1000 సరసాలు ఆడితే రూ.1500 అర్ధనగ్నంగా మారి నృత్యాలు చేస్తే రూ.2,000 చెల్లించేలా రేట్లు కూడా ఫిక్స్ చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.