హస్తరేఖాశాస్త్రం ప్రకారం ఎవరైనా వ్యక్తి జీవితంలో విజయం సాధించి ధనవంతుడు కావాలంటే అందుకు అదృష్టం అవసరమవుతుంది. అయితే ఇదే సమయంలో కొంతమంది పుట్టుకతోనే అదృష్టాన్ని పునికిపుచ్చుకుంటారు. వారు అడగకుండానే అన్ని విషయాలను పొందుతారు. చాలామంది ప్రజలు అదృష్టంతో పాటు వారి అరచేతిలో కొన్ని గుర్తులు కూడా ఉంటాయి. ఇవి వారిని ధనవంతులుగా చేస్తుంది. అంతేకాకుండా జీవితంలో, కెరీర్లో మెరుగైనా విజయాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.ఈ నేపథ్యంలో నే సాధారణంగా పామిస్టరీని ప్రధాన గీతలైన హార్ట్ లైన్, లైఫ్ లైన్, హెడ్ లైన్ ని బట్టి అంచనా వేస్తారు. ఈ మూడు లైన్లు ఏర్పడిన దాన్ని బట్టి.. ఆ వ్యక్తి ఆరోగ్యం, ప్రేమ, తలరాతను వివరిస్తారు. అయితే.. ఈ మూడు లైన్ల ఆధారంగా చేతిలో M అక్షరం ఏర్పడితే.. ? ఏమవుతుందో తెలుసుకుందాం.
హెడ్, హార్ట్, లైఫ్ లైన్లు ఒకదాని మధ్యలో ఒకటి ఏర్పడి ఉంటాయి. లేదా ఒకదాన్ని ఒకటి ఆనుకుని లేదా.. ఏదో రకంగా కలుపుతూ ఉంటాయి. ఇలా ఏర్పడినప్పుడు.. M అనే అక్షరం మీ చేతి మధ్యలో కనిపిస్తుంది.ఒకవేళ మీ అరచేతిలో ఆంగ్ల అక్షరం M ఆకారం ఉంటే వారు అత్యంత అదృష్టవంతులు అవుతారని హస్త సాముద్రికం చెబుతోంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుందట. వారు అత్యంత క్రమశిక్షణను కలిగి ఉంటారట. ప్రతి విషయంలోనూ ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటారట.అయితే కుడిచేతి వాటం ఉన్నవారికి ఎడమ చేతిలో, ఎడమ చేతి వాటం ఉన్నవారికి కుడి చేతిలో అలా ఆంగ్ల అక్షరం M ఉండాలట. అప్పుడే పైన చెప్పిన విధంగా జరుగతుందట.ఇలా ఎమ్ అక్షరం కనింపించే వాళ్లు.. జీవితంలో అదృష్టం పొందుతారు. చాలా స్ట్రాంగ్ క్రమశిక్షణ ఉంటుంది. సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ. అలాగే కెరీర్ లో సక్సెస్ అవుతారు.ఈ నేపథ్యంలో నే మూడు ప్రధాన లైన్ల ద్వారా అంటే.. ఏలా ఏర్పడినా M అక్షరం కనిపిస్తే చాలు అదృష్టం మీకు ఉన్నట్టే.