Ratan Tata: రతన్ టాటా వివాహం చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?
టాటా గ్రూప్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా పెళ్లి చేసుకోకపోవడం వెనుక ముఖ్య కారణం నాలుగు సార్లు తన జీవితంలో లవ్ ఫెయిల్యూర్ అయినట్లు ఒక ఇంటర్వ్యూలో గతంలో వెల్లడించారు.. తన జీవితంలో ఒకేసారి నాలుగు సార్లు ప్రేమ తలుపు తట్టిందని కానీ క్లిష్ట పరిస్థితులు కారణంగా ఆ బంధం పెళ్లి వరకు రాలేకపోయింది అంటూ తెలిపారు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా మళ్లీ ఆ వైపుగా వెళ్లలేదని తన జీవితం మొత్తంలో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం పైన దృష్టి పెట్టానంటూ తెలియజేశారు.
రతన్ టాటా 1937 డిసెంబర్ 28న సూరత్ ప్రాంతంలో జన్మించారు. మంచి చేయడంలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. టాటా గ్రూప్స్ బిజినెస్లను సక్సెస్ఫుల్గా నడిపారు. బిజినెస్ లో సక్సెస్ అయిన రతన్ టాటా ప్రేమలో మాత్రం ఘోరమైన విఫలమయ్యారు. అయితే నాలుగు సార్లు తన ప్రేమ విఫలము అవ్వడానికి కారణం ఏంటనే విషయాన్ని తెలియజేస్తూ.. ప్రేమలో ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవడం తనకు సరైనదిగా అనిపించిందనీ.. ఒకవేళ ఆమె తన జీవితంలోకి వచ్చి ఉంటే మరింత క్లిష్టంగా ఉండేదేమో.. తాను పెళ్లి విషయంలో నాలుగు సార్లు సీరియస్ గా ఆలోచించి ఏదో ఒక భయంతో వెనక్కి తగ్గుతూ వచ్చానని తెలిపారట. అమెరికాలో ఉన్నప్పుడు తన ప్రేమ చాలా ఎక్కువగా ఉండేదని కానీ ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రేమ లేకపోయింది అంటూ తెలిపారు. అంతేకాకుండా రతన్ టాటా ప్రేమించిన ఆమె ఇండియాకి రావడానికి ఇష్టపడలేదట.. దీంతో పాటుగా అప్పట్లో చైనా, ఇండో యుద్ధం కూడా జరగడంతో చివరికి ఆమె అమెరికాలోని సెటిలై మరొకరు వివాహం చేస్తుందని తెలిపారు.