రాధిక కుమారస్వామి భారతీయ సినిమా నటి, నిర్మాత.ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించి 2000లలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది.ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించి 2000లలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది. రుద్ర తాండవ, అవతారం, భద్రాద్రి రాముడు, వంటి ప్రముఖ సినిమాల్లో పనిచేశారు.ఇదిలావుండగా రాధిక, మాజీ సీఎం కుమారస్వామి లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.. సినిమాల్లో ఇలాంటి ప్రేమకథలు చాలా ఉంటాయి. అయితే 18 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి సీక్రెట్ లవ్ స్టోరీ, సినిమా ఇండస్ట్రీలో కూడా కనిపించడంతో కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేగింది. ఇక్కడ మనం ప్రముఖ నటి, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించిన పాపులర్ నటి, నిర్మాత రాధికా కుమారస్వామి గురించి మాట్లాడుతున్నాము. రాధిక 2006 సంవత్సరంలో తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంది, దాని కారణంగా సినీ పరిశ్రమతో పాటు రాజకీయ ప్రపంచం షాక్కు గురైంది. నటి నిర్ణయం ఆమె వ్యక్తిగత జీవితాన్నే కాదు ఆమె సినీ కెరీర్ శాశ్వతంగా మార్చి వేసింది. అదే సమయంలో జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయ జీవితంలోనూ కలకలం రేగింది. దీంతో పాటు కుమారస్వామి రాజకీయ జీవితం కంటే ఆయన వ్యక్తిగత జీవితంపైనే జనాలు ఆసక్తి చూపేవారు.
రాధిక 2002లో కన్నడ చిత్రం 'నీలా మేఘా శామ'తో వెలుగులోకి వచ్చింది. ఆమె మొదటి సినిమా కన్నడలో వచ్చిన ‘నీనాగాగి’. రాధిక మొదటి సినిమా అరంగేట్రం చేసే సమయానికి 9వ తరగతి చదువుతుండగా.. అప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు మాత్రమే. అయితే ఆమె తన సినిమా కెరీర్ను ఎక్కువ కాలం కొనసాగించలేదు.రాధిక 30కి పైగా సినిమాల్లో పనిచేసినా నటిగా కెరీర్ ఆగిపోయింది. నటిగా సినిమాల్లో కెరీర్ చేయకపోగా, సినిమాలను నిర్మించడం ప్రారంభించింది. ఆమె 2012 సంవత్సరంలో తన మొదటి కన్నడ చిత్రం 'లక్కీ'ని కూడా నిర్మించింది.
తెలుగులో రాధికా ఓ రెండు చిత్రాల్లో నటించింది. తారకరత్న హీరోగా వచ్చిన భద్రాద్రి రాముడులో ఆమె హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత అవతారం అంటూ ఓ భక్తరస చిత్రంలో కూడా నటించింది. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకుడు.రాధిక అసలు ప్రేమకథ వెలుగులోకి వచ్చిన ఆ రోజుల్లోనే సంచలనంగా మారింది. 2010లో వీరి రహస్య వివాహం బయటపడింది. నిజానికి తాను 2006లో జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామిని పెళ్లాడినట్లు 2010లోనే రాధిక స్వయంగా వెల్లడించింది. ఈ ఇద్దరికీ ఒక కూతురు కూడా ఉంది.
మీడియా నివేదికల ప్రకారం, వివాహ సమయంలో హెచ్డి కుమారస్వామి వయస్సు 47 కాగా, రాధిక అతని కంటే 27 సంవత్సరాలు చిన్నది. కాగా కుమారస్వామికి ఇది రెండో వివాహం. అతని మొదటి వివాహం 1986 సంవత్సరంలో జరిగింది. నివేదికల ప్రకారం, ఇది రాధికకు రెండవ వివాహం కూడా. ఆమె 2000 సంవత్సరంలో రతన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది, అయితే ఈ వివాహం త్వరలోనే విడిపోయింది.కుమారస్వామికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేయడం రాధిక తండ్రికి ఇష్టం లేదని అంటారు. అయితే రాధిక అతడిని ఎదిరించి పెళ్లి చేసుకుందని టాక్. వారిద్దరూ తమ వివాహాన్ని చాలా గోప్యంగా ఉంచారు. నటి వివాహంతో ఆమె తండ్రి చాలా షాక్ అయ్యాడట.36 ఏళ్ల రాధిక నటిగా చిత్ర పరిశ్రమలో పూర్తిగా ఫ్లాప్ అయింది, అయితే ఆమె పేరు వ్యాపార ప్రపంచంలో చాలా ప్రసిద్ధి. కర్నాటక సీఎంను పెళ్లాడిన తర్వాత కోట్లాది రూపాయలకు యజమాని అయ్యారని అంటున్నారు. మీడియా కథనాల ప్రకారం రాధిక రూ.124 కోట్లకు యజమాని కాగా, ఆమె భర్త కుమారస్వామికి రూ.44 కోట్ల ఆస్తులున్నాయి.