క్యాస్టింగ్ కౌచ్: తరాలు మారిన..తత్వం మారలేదంటున్న సీనియర్ హీరోయిన్లు..!

FARMANULLA SHAIK
* సీనియర్లు సైతం క్యాస్టింగ్ బాధ్యులే..!
* చాప కింద నీరులా..క్యాస్టింగ్ కౌచ్ విస్తరణ..!
* సోషల్ మీడియా వేదికగా బయటపడుతున్న వాస్తవాలు.!
టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో జరిగినటువంటి క్యాస్టింగ్ కౌచ్‌లు వరుసగా  బ‌య‌టకువస్తున్నాయి. అయితే దాంట్లో భాగంగా సీనియర్ హీరోయిన్స్ సైతం వారి వారి భావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.అందులో ముఖ్యంగా అలనాటి సీనియర్ హీరోయిన్ ఐనా జయప్రద, జయసుధ, ఆమని...క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ మా కాలంలో ఎవరైనా దర్శకనిర్మాతలు మీ అమ్మాయిని సినిమాలలోకి పంపిస్తారా అని అడిగితే దానికి వారి తల్లిదండ్రులు ఇష్టపడేవాళ్లు కాదని మాకు అలాంటి ఖర్మ పట్టలేదని అనేవారు.అయితే ప్రస్తుతపు రోజుల్లో తల్లిదండ్రులే తమ పిల్లలకు శిక్షణ ఇప్పించి మరి సినిమాలలోప్రోత్సహిస్తున్నారు.నేను స్కూల్‌లో చదివే రోజుల నుంచి నటిస్తున్నాను. మాతరం లోను కొంతవరకు క్యాస్టింగ్ కౌచ్ ఉన్న మాట వాస్తవమే కానీ నేనెప్పుడూ అలాంటి సంఘటన ఎదుర్కోలేదని ఈ జయప్రద అన్నారు.కానీ ప్రస్తుతం ముంబై నుంచి ఎందరో హీరోయిన్లు అవకాశాల కోసం వచ్చి టాప్‌ హీరోయిన్లు కావాలని ఆశపడడంతో ఈ కాస్టింగ్‌కౌచ్‌ బాగా ఎక్కువైంది.రాజకీయాలలో, సినిమాలలోనే గాక అవకాశాలు ఎక్కడ ఉంటాయో అక్కడ కాస్టింగ్‌కౌచ్‌ ఉండే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు సీనియర్ నటి జయప్రద.
అలాగే మరొక సీనియర్ సినీనటైనా ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగు, తమిళ భాష చిత్రాలలో నటిస్తూ హీరోయిన్గా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో వెలుగు వెలిగినటువంటి ఆమని ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పలు సినిమాలలో తల్లి క్యారెక్టర్స్ చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూంటారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటినుంచో ఉంది అయితే అప్పట్లో సోషల్ మీడియా అందుబాటులో లేకపోవడం వల్ల ఈ విషయాలు బయటకు తెలిసేది కాదు కానీ ప్రస్తుతం అలా కాదు ప్రతి చిన్న విషయం అందరికీ తెలుస్తోందని తెలిపారు.
ఇండస్ట్రీలో కొన్ని నిర్మాణ సంస్థల నుంచి హీరోయిన్స్ తరచూ ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారని ఆమని తెలిపారు.తాను కూడా కెరియర్ మొదట్లో ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నానని అన్నారు.అప్పట్లో ఒక ఫైనాన్షియర్ సినిమా కథ చెప్పాలని తనని ఒంటరిగా బీచ్కి రమ్మనడంతో అక్కడికి వెళ్తే గాని తెలీలేదన్నారు.అలాగే ఒక తమిళ సినిమాలో నటిస్తున్న సమయంలో ఒక స్విమ్మింగ్ పూల్ సీన్ చేయడం కోసం తనపై ఉన్న బట్టలన్నీ విప్పేయమనడిగితే కుదరదని చెప్పానన్నారు.ఈ సందర్భంగా ఇండస్ట్రీలో తనకు ఎదురైనటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి ఆమని ప్రస్థావించారు.అయితే సీనియర్లుగా ఈలాంటి క్యాస్టింగ్ కౌచ్ అనేది అన్నీ రంగాల్లో ఉందని తరాలు మారిన తత్వం మారట్లేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: