వర్షపు నీటిపై డాన్స్ చేసింది.. పాపం చివరికి?

praveen

ఈ రోజుల్లో చాలామంది యువత రీల్స్ చేస్తూ ఫేమస్ కావాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు డాన్సులు చేస్తూ ఇన్‌స్టాలో చిన్నపాటి సెలబ్రిటీ కావాలని ట్రై చేస్తున్నారు అందుకోసం వారు ఎండా వానా వరదలు చలి ఇలాంటి వాటిని లెక్క చేయడం లేదు. పోటీపడి మరీ డాన్సులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రమాదాలు వారికి జరుగుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో వర్షాకాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వానలు బాగా కురుస్తున్నాయి. అన్ని చోట్లా వాటర్ నిల్వ ఉంటుంది ఇక ఉపరితలాలపై తడిగా ఉంటాయి. అంతేకాదు వాటిపై  నాచు, పాచి పట్టుకుంటుంది. వీటిపై చాలా జాగ్రత్తగా నడవాలి. లేకపోతే జారి కింద పడిపోయే ప్రమాదం ఉంది. సరిగా అదే ఒక యువతికి జరిగింది.
ఆ యువతి రీల్స్ చేద్దామనుకుంది. లైక్స్, వ్యూస్ తెచ్చుకొని తన ఫ్రెండ్స్ కి చూపించి సంబరపడి పోదామనుకుంది. అందుకు ముందుగా ఈ యువతి తన టెర్రస్ పైకి ఎక్కింది. ఆ తర్వాత ఒక హిందీ పాటకు డాన్స్ చేస్తూ ఉంది. ఈ డాన్స్‌ను ఆమె ఫ్రెండ్ షూట్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఆ టెర్రస్ పైన కొన్ని నీళ్లు నిల్వ ఉన్నాయి. వాటి కింద ఉపరితలం పాచి పట్టి జారుడుగా తయారయ్యింది. అంతే ఈ యువతి డాన్స్ చేస్తూ దాని మీద కాలు పెట్టగానే జారి కింద పడిపోయింది. ఆమె ఒక్కసారిగా జారి ధబేల్‌మని కిందపడిపోవడంతో తల నేలకు బలంగా తగిలింది. ఆ నొప్పి భరించలేక ఆ యువతి ఏడవడం మనం చూడవచ్చు. ఈ ఘటనతో వీడియో తీస్తున్న ఆ యువతి ఫ్రెండ్ బాగా షాక్ అయింది. అంతటితో ఈ వీడియో ముగిసింది.
''ఇంటి పైకప్పును శుభ్రం చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదేమో'' అని కొందరు నెటిజన్లు కామెంట్లు ''డాన్స్ నేర్చుకుంటే సరిపోదు, డాన్స్ వేయడానికి సరైన ప్రదేశానికి కూడా ఎన్నుకోవాలి,''.. అంటూ మరికొందరు ఆమెకు సలహాలు ఇచ్చారు ఈ రీల్స్ వల్ల ఎవరికి, ఏం ఉపయోగం అంటూ మరికొంతమంది ఆమెను తిట్టారు. దీనికి 20 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.
https://www.instagram.com/reel/C_usHBOP2hd/?utm_source=ig_web_copy_link లింక్ మీద క్లిక్ చేసి వీడియోను చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: