ప్ర‌కృతి వైప‌రిత్యాలు- హీరోలు: అగ్రరాజ్యం సైతం చలించి ఆదుకునేలా చేసిన ఒరిస్సా 'సూపర్ సైక్లోన్'..!

FARMANULLA SHAIK
* ఒరిస్సాను అతలాకుతలం చేసిన సూపర్ సైక్లోన్.!
* ముప్పై వేల మందిని మింగేసిన రాకాసి తుఫాన్..!
* ఇతర దేశాలను కూడా చలించేలా చేసిన ఒరిస్సా సైక్లోన్.!
ప్రపంచ స్థాయిలో ఉష్ణమండల తుఫానులు మరియు ఇతర వాతావరణ సంబంధిత ప్రమాదాలు అనేవి దాదాపు 1998- 2017 మధ్య ప్రకృతి విపత్తుల కారణంగా సంభవించిన 90%  వైపరీత్యాలకు కారణమయ్యాయి.భారతదేశంలోని ఒడిషా రాష్ట్రం ఉష్ణమండల తుఫానులకు చాలా అవకాశం ఉంది.ఇది గతంలో అనేక సార్లు ఇలాంటి తుఫాన్లు దాని తీరాన్ని తీవ్రంగా తాకాయి.అక్టోబరు 29,1999న ఒడిశాలోని పారాదీప్ సమీపంలో భారత తూర్పు తీరంలో ల్యాండ్‌ఫాల్ చేసిన 1999 ఒడిషా సూపర్ సైక్లోనిక్ తుఫాన్ ఉత్తర హిందూ మహాసముద్రంపై ఇప్పటివరకు నమోదైన అత్యంత తీవ్రమైన ఉష్ణమండల తుఫాను.ఇది దాదాపు గంటకు 270కి.మీ వేగంతో కూడిన గాలులతో విజ్రంభించింది.
మొదట్లో ఈ సైక్లోన్ అనేది 1999 అక్టోబర్ 25న అండమాన్ దీవులకు దాదాపు 550కి.మీ దూరంలో డిప్రెషన్ కారణంగా వాయుగుండం ఏర్పడి అది క్రమక్రమంగా దాని దిశను మార్చుకుంటా పోర్ట్ బ్లయిర్ కు మూడు వందల కి.మి దూరంలో కేంద్రీకృతం అయి అక్టోబర్26న ఒక సైక్లోన్ లాగా మారింది.ఆతర్వాత ఈ సైక్లోన్ రెండు మూడు రోజుల్లోనే ఒరిస్సాను దాదాపు కోలుకోలేని దెబ్బ తీసింది.దాంట్లో భాగంగానే అనేక తీరా ప్రాంతాలు కోతకు గురి కావడం,లక్షల మంది నిరాశ్రాయులవ్వడం,అలాగే అనేక పంట పొలాలు నాశనం అయ్యాయి అనేక మందిని బలి కూడా కోరుకుంది. అందుకే ఒడిశా రాష్ట్రంలో 20వ శతాబ్దపు అత్యంత తీవ్రమైన తుఫానుగా పరిగణించబడే దీన్ని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు BOB 06 తుఫాను అని నామకరణం చేశారు.
అయితే ఈ తుఫాన్ మాత్రం అత్యంత విపత్తు నష్టాన్ని చవిచూసింది.కేవలం 11 రోజుల క్రితం సమీప ప్రాంతాలను తాకిన చాలా తీవ్రమైన తుఫాను ప్రభావంతో నష్టం మరింత పెరిగింది.ఒడిశాలోని పన్నెండు జిల్లాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి.వీటిలో జగత్‌సింగ్‌పూర్‌లోని ఎరాస్మా మరియు కుజాంగ్ బ్లాక్‌లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. మొత్తంగా తుఫాను కారణంగా 12.9 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు.తుఫాను మృతుల సంఖ్యకు సంబంధించి అంచనాలు గణనీయంగా మారుతున్నాయి, అయితే భారత వాతావరణ శాఖ సుమారు పది వేలు మంది మరణించారని ఈ మరణాలలో ఎక్కువ భాగం జగత్‌సింగ్‌పూర్‌లో సంభవించాయని అక్కడ దాదాపు ఎనిమిది వేలమంది చనిపోయారని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ది ఎపిడెమియాలజీ ఆఫ్ డిజాస్టర్స్  డేటాబేస్లో తెల్సింది.అయితే ఇతర అంచనాల ప్రకారం మరణాల సంఖ్య 30,000 దాక తేలింది.
అయితే ప్రభుత్వం లెక్కల ప్రకారం ఈ సైక్లోన్ వల్ల దాదాపు 4.4 బిలియన్ నష్టం వాటిల్లింది.దాంతో ప్రభుత్వం తక్షణ సాయం కింద 3000 కోట్లు నిధులు మంజూరు చేసింది.అయితే ఈ సూపర్ సైక్లోన్ చేసిన నష్టానికి అగ్రరాజ్యం ఐనా అమెరికా చలించిపోయి దాదాపు పదమూడు మిలియన్ డాలర్ల డొనేషన్ ఇచ్చి వరద బాధితులను ఆదుకుంది.దాదాపు పన్నెండు, పదమూడు దేశాల నుండి వాలంటీర్లు కూడా వారి వారి సహాయ సహకారాలు అందించారు. ఒరిస్సా చరిత్రలోనే 1999 సూపర్ సైక్లోన్ అనేది ఒక మర్చిపోలేని సంఘటన లాగా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: