వైరల్: తెలుగు రాష్ట్రాలలోకి కొత్త వైరస్.. ఎన్ని కేసులంటే..?
నోరా వైరస్ ఇది ఒక రకమైన వైరస్ గా ఉండడమే కాకుండా గ్యాస్ట్రో ఎంటేరిటీస్ కు కారణమవుతుందట. ముఖ్యంగా ఇది శరీరంలో ఉండే కడుపు ప్రేగుల వాపుకు కారణమై తీవ్రమైన వాంతులు విరేచనాలు వచ్చేలా చేస్తుందట. నారా వైరస్ లక్షణాలు విషయానికి వస్తే..
విరేచనాలు అవ్వడం, కడుపునొప్పి వాంతులు రావడం, చలి జ్వరం నీరసం డిహైడ్రేషన్ గా మనిషి కనిపిస్తూ ఉంటారట.
ఇక నోరా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది అనే విషయానికి వస్తే కలుషితమైన నీటిని లేదా ఆహారాన్ని తిన్నవారికి ఈ వైరస్ సోకుతుందట. అలాగే ఈ వైరస్ సోకిన వ్యక్తులతో చేతులు తాకడం, మాట్లాడుతున్నప్పుడు తుంపర్లు పడడం వల్ల కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందట. హైదరాబాదులో పాత బస్తీలో ఎక్కువగా ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లుగా అధికారులు గుర్తించారు.
నోరా వైరస్ రాకుండా ఉండాలి అంటే తరచూ శుభ్రంగా స్నానం చేయడమే కాకుండా బయటికి వెళ్లి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. సాధారణంగా ఈ వైరస్ రెండు మూడు రోజులలోనే తగ్గిపోతుంది. డిహైడ్రేట్ కాకుండా ఉండేందుకు ద్రవపదార్థాలను తీసుకోవలసి ఉంటుంది.స్వచ్ఛమైన నీటిని తాగుతూ ఉండాలి గోరువెచ్చని తాగడం వల్ల మరింత మంచిది. అలాగే దుస్తులను కూడా ఎండకి ఆరవేసిన తర్వాత వేసుకోవడం మంచిది.