చీర కట్టుకొని జిమ్‌లో అదిరిపోయే కసరత్తులు చేసిన మహిళలు..?
నిజం చెప్పాలంటే చీర కట్టుకుని జిమ్‌లో వ్యాయామం చేయడం చాలా కష్టం. చీర కట్టుకుని జిమ్ పరికరాలను ఉపయోగించడం అంత సులభం కాదు. అయితే జాగ్రత్తలు తీసుకుంటే వ్యాయామం చేయడం అసాధ్యమేమీ కాదు. ఈ మహిళలు ఎక్సర్సైజ్ చేయడానికి కంటే రీల్స్ చేసి నెట్ లో ఫేమస్ అవ్వడానికే చీర కట్టుకుని జిమ్‌కి వచ్చారని సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.
జిమ్‌కి వచ్చినప్పుడు మహిళలు బ్లౌజ్‌లు ఎందుకు ధరించరు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వారు నిజంగా సంస్కారవంతంగా జిమ్‌కి వెళ్లాలనుకుంటే బ్లౌజ్ ధరించాలని అంటున్నారు. కొందరు మహిళలు చీర కట్టుకుని జిమ్‌కి వెళుతూ మన భారతీయుల సంస్కృతిని రిఫ్లెక్ట్ చేస్తున్నారని ప్రశంసించారు. పబ్లిసిటీ కోసమే అయినా అందులో తప్పేముంది ఒక యూజర్ కామెంట్ చేశారు.
కొంతమంది ప్రజలు జిమ్‌లో ప్రతి ఒక్కరు తమ వ్యాయామం, ఆరోగ్యం, శరీరంపై మాత్రమే దృష్టి పెట్టాలని అంటున్నారు. ఇతరుల వైపు చూడకుండా తమ పని తాము చేస్తే సమస్య ఉండదని పేర్కొంటున్నారు. ఇకపోతే లేటెస్ట్ వీడియో ప్రజల్లో చాలా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ వీడియోను ఇప్పటికే 12 లక్షల మంది చూశారు. ఈ https://x.com/HasnaZaruriHai/status/1829041290748801300 లింకు పై క్లిక్ చేసి వీడియోను చూడవచ్చు.