ఇదెక్కడి విడ్డూరం..కిడ్నాపర్ నుంచి తల్లి వద్దకు వెళ్లేందుకు ఇష్టపడని బాలుడు?
ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఈ మధ్యకాలంలో పిల్లలను కిడ్నాప్ చేసే వారి ముఠాలు ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఏకంగా చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి ఇతర ప్రాంతాలకు అమ్ముకోవడం చేస్తున్నారు. అయితే ఇలా కిడ్నాప్ కి గురైన పిల్లవాడు చాలా రోజులపాటు కిడ్నాపర్ల దగ్గర ఉండి.. ఇక ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంటే అతని ఆనందానికి అవధులు ఉండవు. పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లిదండ్రులను గట్టిగా కౌగిలించుకుంటాడు పిల్లాడు. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా ఇలాగే జరుగుతుంది.
కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఏకంగా కిడ్నాప్ అయిన పిల్లవాడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లేందుకు నిరాకరించాడు. కిడ్నాపర్ ను గట్టిగా పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్ లో వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్ నుండి తల్లి వద్దకు వెళ్లేందుకు ఒక బాలుడు నిరాకరించడంతో అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పృద్వి అనే మూడేళ్ల బాలుడు 14 నెలల క్రితం కిడ్నాప్ కి గురయ్యాడు. ఇక ఇటీవల పోలీసులు అతన్ని గుర్తించారు. అయితే పోలీస్ స్టేషన్కు తల్లిదండ్రులను పిలిపించగా.. బాలుడు కిడ్నాపర్ దగ్గర నుంచి తల్లి దగ్గరికి వెళ్లేందుకు నిరాకరించారు. కిడ్నాపర్ను గట్టిగా పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. దీంతో ఆ కిడ్నాపర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు.