ఓయో రూమ్స్ కు వెళ్ళారా... ఇక అంతే..?

FARMANULLA SHAIK
ప్రముఖ హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫాం ఓయో బుకింగ్స్‌కు సంబంధించి ఈ ఏడాది రిపోర్ట్ విడుదలైంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రాల జాబితాలో చూస్తే ఉత్తర్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ప్రముఖ హాస్పిటాలిటీ టెక్ ప్లాట్‌ఫామ్ ఓయో ట్రావెలోపీడియా 2023 పేరిట సోమవారం రోజు ఒక రిపోర్డ్ విడుదైలంది. నగరాలు, రాష్ట్రాలు సహా ఆధ్యాత్మిక ప్రదేశాల వారీగా ర్యాంకుల్ని ఈ నివేదికలో పొందుపరిచింది.తక్కువ ధరకే గదులు అద్దెకు లభిస్తుండటంతో చాలా మంది ఓయో రూమ్స్ వినియోగిస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేవారు ఓయో రూముల్లో స్టే చేస్తూ తమ పనులు ముగించుకుంటున్నారు.ఇక యువత కూడా ఓయో రూములను ఎక్కవగా వినియోగిస్తుున్నారు. అయితే ఈ ఓయో రూమ్స్ తీసుకునే జంటలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొందరు కేటుగాళ్లు ఓయో రూముల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి జంటలు ఏకాంతంగా గడిపే వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. ఆపై డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు.ఈ నేపథ్యంలో నే జంటలనే టార్గెట్ గా చేసుకున్న ఓ హోటల్ నిర్వాహకుడు ఓయో రూమ్ లో హిడెన్ కెమెరా పెట్టి, కస్టమర్లను బ్లాక్ మెయిల్ చేసి, డబ్బు గుంజుతున్నాడు.
 

ఓ జంట ఫిర్యాదుతో హోటల్ యజమాని నిర్వాకం వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ లో సితా గ్రాండ్ పేరుతో ఓయో సంస్థతో కలిసి గదులు అద్దెకు ఇచ్చే హోటల్ నడుపుతున్నారు. అయితే జంటలనే టార్గెట్ గా చేసుకున్న హోటల్ నిర్వాహకుడు గదిలో రహస్య సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. రూంలు అద్దెకు తీసుకున్న వ్యక్తుల ఏకాంత వీడియోలు రికార్డు చేసి, వారిని బెదిరింపులకు గురి చేసేవాడు.హోటల్ నిర్వాహకుడి బాధను ఎదుర్కొంటున్న ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హోటల్‌ను తనిఖీ చేసి రహస్య సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు వద్ద నుంచి రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఓయో రూమ్స్ ఎక్కువగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే దీనిని క్యాష్ చేసుకునేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడపడితే అక్కడ విచ్చల విడగా ఓయో హోటళ్లు వెలిశాయి. 

ఇవి యువతీయువకులు ఏకాంతంగా గడిపేందుకు బెస్ట్ లొకేషన్‌గా మారుతున్నాయి. కొన్ని ఓయో రూమ్స్‌ డ్రగ్స్‌కు కూడా కేంద్రాలుగా మారుతున్నాయి. ఆన్ లైన్ లో రూమ్స్ బుక్ చేసుకుంటున్న యువత గదులలో విచ్చల విడిగా మద్యం సేవిస్తూ.. డ్రగ్స్ తీసుకుంటున్నారు. గదులలో ఇద్దరికి మించి మూడవ వ్యక్తికి అనుతించకపోవడంతో వీటి పట్ల యువతీ, యువకులు ఆకర్షితులవుతున్నారు. ఇలాంటి వ్యవహారాలన్నింటినీ ఓయో హోటల్ నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు.శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాకం అంటూ వచ్చిన వార్తపై ఓయో ప్రతినిధి ఒకరు స్పందించారు. ఇది తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. సందేహాలు వ్యక్తమవుతున్న హోటల్‌ను దాని యజమాని నిర్వహిస్తున్నారని, విషయం తెలిసిన వెంటనే హోటల్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టామని ఓయో ప్రతినిధి వివరించారు. పోలీసుల విచారణలో ఏం తేలనుందనే దానికోసం ఎదురుచూస్తున్నామని, దర్యాప్తులో తాము పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నామని వెల్లడించారు. అవసరమైనప్పుడు విచారణకు హాజరవుతామని, ఓయో ఇలాంటి నీచమైన చర్యలను సహించదని, తమ విధానం ఇదేనని ఓయో ప్రతినిధి వివరణ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: