ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ఫామ్ లోకి రావాలని కొంతమంది చేసే పనులు వారిని ఇరకాటంలో పెడుతున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం అరచేతిలో ఉన్నట్టే. ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ వీడియోలు జనాలకు వ్యసనాలుగా మారాయి. ప్రతి ఒక్కరు యూట్యూబ్, ఇన్స్టాగ్రాంలలో తమ విజ్ఞాన ప్రదర్శన చేస్తున్నారు. ఓవైపు తమ ట్యాలెంట్ చూపించుకోవటమే కాదు.. ఓవైపు ఫేమస్ అవుతున్నారు..రాత్రికి రాత్రే సెలబ్రిటీ కావాలి..డబ్బులు, పేరు సంపాదించాలి అని యూట్యూబర్లు చేస్తున్న ఆగడాలు అంతా ఇంతాకావు..రీల్స్ చేయడమనేది కొందరికి ఒక హాబీ అయితే..కొందరికి పేరు కావాలి..డబ్బు కావాలి. దీనికోసం ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడుతున్నారు.. టాలెంట్ ను నిరూపించుకోవడం మంచిదే.. పదిమందితో గ్రేట్ అనిపించుకోవాలని ఎవరికైనా ఉంటుంది.స్థానిక యూట్యూబర్ తన ఛానెల్లో సాంప్రదాయ పీకాక్ కర్రీ రెసిపీ పేరుతో వివాదాస్పద వీడియోను విడుదల చేసిన తర్వాత జంతు ప్రేమికుల నుండి నిరసనను రేకెత్తించాడు.జాతీయ పక్షి నెమలిని వేటాడటం, చంపడం నేరం. కానీ తెలంగాణకు చెందిన ఓ యూట్యూబర్ దాన్ని చంపి ఏకంగా కూర ఎలా వండాలో వీడియో చేశాడు.టాలెంట్ ను నిరూపించుకోవడం మంచిదే.. పదిమందితో గ్రేట్ అనిపించుకోవాలని ఎవరికైనా ఉంటుంది.. కానీ లిమిట్స్ దాటి ఓవర్ చేస్తే.. ఇది గో ఇలా పోలీసు బాస్ లతో మర్యాదలు తప్పవుమరీ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యూట్యూబర్ .. వ్యూస్ లైకుల కోసం ఏం పనిచేశాడో తెలిస్తే .. మీరు ఔరా! అనాల్సిందే..వెజ్‌తో పాటు నాన్ వెజ్‌ను తనే వండి ఛానల్లో అప్లోడ్ చేస్తాడు. గతంలో అడవి పంది, ముళ్ల పంది, ఉడుము మాంసాలతో వీడియోలు చేశాడు.
ఈ క్రమంలోనే నెమలి కూర ఎలా వండాలో చెప్తూ వీడియో చేసి తన ఛానల్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీంతో స్థానిక యూట్యూబర్‌పై కేసు నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన కొసం ప్రణయ్ కుమార్ పోస్ట్ చేసిన ఈ వీడియో భారతదేశ జాతీయ పక్షి అయిన నెమలిని వేటాడడాన్ని ప్రోత్సహించడంపై విమర్శలు వచ్చాయి. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం నెమలికి అత్యున్నత రక్షణ కల్పించబడింది. ప్రణయ్‌కుమార్ ఛానెల్‌ని నిశితంగా పరిశీలిస్తే.. అతను అడవి పందితో చేసిన కూరను ఎలా ఉడికించాలో చూపించే వీడియోను కూడా అప్లోడ్ చేసినట్లు తేలింది. అది వివాదాస్పదమైనది. ఆ వీడియోను తొలగించినప్పటికీ, దానిపై దృష్టి పెట్టాలని పోలీసులు, అటవీశాఖ అధికారులను జంతు హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అల్ఖిల్ మహాజన్ తన ఎక్స్ అకౌంట్లో "సంబంధిత చట్టం ప్రకారం కేసు నమోదు చేయబడింది. అతనిపై, అలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము" అని తెలిపారు.ప్రణయ్‌ని కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రణయ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ పేరు శ్రీ టీవీ. ఇప్పటిదాకా 536 వీడియోలు అప్లోడ్ చేశాడు. ఇతనికి 2 లక్షల 77వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.