పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో.. మీరే చూడండి?

frame పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో.. మీరే చూడండి?

praveen
సాధారణంగా పెద్దలు అప్పుడప్పుడు చెప్పే సామెతలు కొన్ని మనిషి నిజ జీవితంలో జరిగే కొన్ని ఘటనలకు బాగా సరిపోతుంది అన్న విషయం తెలిసిందే.  అలాంటి సామెతలను పిట్ట కొంచెం కూత గనం అనే సామెత కూడా ఒకటే. ఇక ఈ సామెతను మనిషి చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాడు. ఎవరైనా చిన్నపిల్లలు గట్టిగా అరిచారు అంటే చూడడానికి చిన్నపిల్లాడే గాని ఇక ఎంత గట్టిగా అరుస్తున్నాడో చూడు.. పిట్ట కొంచెం కూతగనం అంటే ఇదేనేమోఅని అంటూ ఉంటారు. అదే సమయంలో చిన్న పిల్లలు పెద్దలు సాధించలేనిది కూడా సాధిస్తే పిట్ట కొంచెం కూతగనం అంటే ఇదే చూడు.. అతను ఎంత గొప్ప విషయం సాధించాడు అని మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాం.

 ఇలా మీ జీవితంలో పిట్ట కొంచెం కూతగనం అనే పదానికి చిరునామా ఎవరు అంటే ఎంతో మందిని చూపిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఇదే సామెతకు బాగా సరిపోయింది మనిషి కాదు ఏకంగా ఒక పిట్టె. ఇక ఆ పిట్టను చూసిన తర్వాత నిజంగానే ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా పిట్ట కొంచెం కూత గనం అనే సామెత వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చూడ్డానికి ఎంతో చిన్న ఆకారంలో కనిపించే ఆ పక్షి  అరుపుతో అందరిని భయపెట్టేస్తుంది. దీంతో ఇక ఈ పక్షికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఏకంగా చెవులు గుయ్యిమనేలా కూతపెట్టే పిట్ట గురించి అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అలాంటి పక్షిని మీరు ఎప్పుడైనా చూసారా.. అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో కనిపించే స్క్రమింగ్ బీహా బిగ్గరగా అరుస్తూ ఉంటుంది. ఇలా అరవడంలోనే ఆ పక్షి అత్యంత ప్రసిద్ధి. దీని కూత ఏకంగా 116 డిసబిల్స్ వరకు చేరుకోగలదు. అయితే సంభోగం చేయాలి అనే కోరిక ఆ పిట్టకు కలిగినప్పుడు.. దూర ప్రాంతాలలో ఉన్న మగ పక్షులకు సంకేతం అందించడం కోసం.. ఇలా వాటిని పిలవడానికి ఆ పిట్ట బిగ్గరగా అరుస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఆ పిట్ట ఎంత బిగ్గరగా అరుస్తుంది అన్నదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: