ఓరి నాయనో.. మొసలికి ఆకలేస్తే ఇలాక్కూడా చేస్తుందా?

praveen
ఈ భూమ్మీద ఉండే అత్యంత ప్రమాదకరమైన జీవులలో మొసళ్ళు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. సాధారణంగా అడవికి రారాజు సింహం అని అంటూ ఉంటారు  కానీ మొసళ్ళు మాత్రం నీటిలో ఉంటే అడవికి రారాజు అయిన సింహాన్ని సైతం వేటాడగల బలాన్ని కలిగి ఉంటాయి అని చెప్పాలి. అందుకే ఇక నీటిలో ఉన్నప్పుడు మొసళ్ళు దగ్గరికి వెళ్లడానికి ఏ జంతువు కూడా సాహసం చేయదు. ఒకవేళ సాహసం చేసి వెళ్లిందా మొసలి నోటికి చిక్కి విలవిలలాడిపోతూ ఉంటుంది. చివరికి కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే మొసళ్లు ఎంత దారుణంగా దాడి చేస్తాయి అన్నదానికి సంబంధించిన వీడియోలు   ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతున్నాయి.

 ఒక్కసారి మొసలికి ఆకలి వేసింది అంటే చాలు ఎదురుగా ఉన్నది ఎంత బలమైన జంతువు అయినా సరే వెనకడుగు వేయకుండా వేటను కొనసాగిస్తూ ఉంటుంది. దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీసి కడుపు నింపుకుంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు మొసళ్ళు ఎలా ఇతర జంతువులను వేటాడుతుంది. ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటుంది అన్నదానికి సంబంధించిన వీడియోలు చాలానే వెలుగులోకి వచ్చాయి. కానీ మొసలి ఆకలి వేస్తే ఏమైనా చేసేస్తుంది అన్నదానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వీడియో చూసి ప్రస్తుతం సోషల్ మీడియా జనాలు మొత్తం షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

 మొసళ్ళు తీవ్రమైన ఆకలితో ఉంటే ఎలా ఉంటుందో అన్నదానికి ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో నిదర్శనంగా మారిపోయింది. ఆ మొసలికి బాగా ఆకలేసింది. కానీ ఏ జంతువు కంటికి కనిపించలేనట్టుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన మొసలి చివరికి మరో మొసలి పైనే దాడి చేసింది. చివరికి దాన్ని గట్టిగా కొరికి ప్రాణాలు కూడా తీసేసింది. ఇక చనిపోయిన మొసలిని నోటిలో పట్టుకుని తన స్థావరంలోకి తీసుకువెళ్లింది. అయితే ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు ముందుగా మొసలి ఏదో కారణంతో చనిపోయిందని అనుకుంటారు  కానీ ఆ తర్వాత ఇక చనిపోయిన మొసలిని నోట్లో పట్టుకుని మరో భారీ మొసలి నీటి పైన కు రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడతారు అని చెప్పాలి. అయితే అదే ప్రాంతంలో పడవల్లో ఉన్నవారు ఇదంతా తమ కెమెరాలలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: