రన్ వే పైకి ఒకేసారి రెండు విమానాలు.. చివరికి ఏం జరిగిందంటే?

praveen
బస్సు, రైలు ప్రయాణాలతో పోల్చి చూస్తే కాస్త ఖర్చు ఎక్కువైనా సరే విమాన ప్రయాణం ఎంతో సౌకర్యవంతం గా ఉంటుందని అందరూ చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఎంత సుదూర ప్రాంతాలకు వెళ్లాలన్న కేవలం గంటల వ్యవధి లోనే విమాన ప్రయాణం ద్వారా గమ్యస్థానానికి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా విమానం గాల్లో దూసుకుపోతూ ఉంటుంది. మరోవైపు విమానంలో ప్రయాణించడం అనేది ఒక స్టేటస్ అన్నట్లుగా ఎంతో మంది భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అయితే సోషల్ మీడియాలో విమాన ప్రమాదాలకు సంబంధించిన కొన్ని కొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రం విమాన ప్రయాణాలు ఎంత ప్రమాదకరమైనవ అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మరోసారి విమానం ఎక్కాలంటే వెన్నులో వణుకు పుట్టే లాగే భయం కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఏకంగా ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే రెండు విమానాలు ఒకదానికి ఒకటి ఢీకొంటాయేమో అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది.

 ఎందుకంటే ఒక విమానం రన్వే పై పరుగులు పెడుతూ టేక్ ఆఫ్ అవుతుండగా.. ఇంకో విమానం గాల్లో నుంచి దూసుకు వచ్చి ఇక రన్వే పై ల్యాండ్ అవుతూ ఉండడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ రెండింటికి మధ్య కేవలం అతికొద్ది దూరం మాత్రమే ఉండడంతో అంతా హడలెత్తిపోయారు. అయితే ఈ షాకింగ్ ఘటన ముంబై ఎయిర్పోర్ట్ లో చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ప్రయాణికుల భద్రత ఇండిగో కి అవసరం లేదా అంటూ అందరూ విమర్శలు గుప్పించారు. అయితే ఇందుకు బాధ్యుడైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని ఇక సంస్థ చివరికి సస్పెండ్ చేసింది. ఈ వీడియో చూసి నెటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: