పులి నోట్లో ఇరుక్కున్న ఎముక.. చివరికి?
ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారి పోయింది. సాధారణం గా అడవుల్లో ఉండే అత్యంత ప్రమాదకరమైన జీవులలో పులి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. పెద్ద పెద్ద జంతువుల సైతం ఎంతో అలవోకగా వేటాడి ఇక ఆహారంగా మార్చుకోగలదు. అయితే ఇలా ప్రమాదకరమైన పులికి కూడా కొన్ని కొన్ని సార్లు ఊహించని రీతిలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా పులికి వచ్చిన సమస్యలు చివరికి మనుషులే తీర్చడం లాంటిది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. పులి నోట్లో ఒక ఎముక ఇరుక్కుపోయింది. దీంతో నోటిని మూయలేక అలాగే తెరుచుకొని ఉండలేక పులి విలవిలలాడిపోయింది.
దీంతో ఇది గమనించిన అటవీశాఖ అధికారులు ఆ పులిని బంధించి ఇక దానిపంటిలో ఇరుక్కుపోయిన బొక్కను తొలగించేందుకు డాక్టర్ను పిలిపించారు. ఇలా పులిపంటిలో ఒక పెద్ద సైజు ఎముక ఇరుక్కుపోవడంతో ఏకంగా వైద్యులకు సైతం దానిని తొలగించడానికి అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి అక్కడికి చేరుకున్న వైద్యులు సుత్తితో కొట్టి మరి పులి నోట్లో ఇరుక్కుపోయిన ఎముకను ఊడదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.