కొమొడో డ్రాగన్ - అడవి దున్న మధ్య ఫైట్.. సై అంటే సై అంటూ?

praveen
అడవుల్లో ఉండే ప్రతి జంతువు ప్రతి క్షణం జీవన పోరాటం సాగించాల్సిందే. కొన్ని జంతువులు ఇతర జంతువులను వేటాడి ప్రాణాలు తీసి ఆహారంగా మార్చుకుంటాయి. ఇలా కడుపు నింపుకోవడం ద్వారానే మనుగడను సాగిస్తూ ఉంటాయి. ఇంకొన్ని జంతువులు ఇలా క్రూర మృగాల నుంచి తప్పించుకుంటూ ప్రతిక్షణం ప్రాణాలను కాపాడుకునేందుకు  పోరాటం సాగిస్తూనే ఉండాల్సి ఉంటాయి. ఈ క్రమంలోనే ఇలా వైల్డ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేదానికి సంబంధించి అటు సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి.

 ఇక ఇలాంటి వీడియోలను చూసి నేటిజన్స్ అందరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే అచ్చం మొసలి ఆకారాన్ని కలిగి ఉండే కోమడో డ్రాగన్ ఎంత ప్రమాదకరమైన జంతువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  పెద్ద పెద్ద జింకలు గేదెల పైన అవలీలగా దాడి చేసి.. ఏకంగా ఆహారంగా మార్చుకుంటూ ఉంటాయి కొమడో డ్రాగన్లు. కొన్ని కొన్ని సార్లు పులులు సింహాలు లాంటి ప్రమాదకరమైన జంతువులపై కూడా దాడికి దిగేందుకు వెనకడుగు వేయవు. అయితే ఇక్కడ కోమడో డ్రాగన్ కి ఎంత ఆకలేసిందో ఏమో.. ఏకంగా ఒక భారీ అడవి దున్నపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఇక కోమడో డ్రాగన్ నుంచి తప్పించుకోవాల్సిన అడవి దున్న.. ధైర్యంగా దానితో పోరాటం చేయడానికి సిద్ధమైంది.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి  ఈ వీడియోలో చూసుకుంటే ఓ అటవీ ప్రాంతంలోని విశాల ప్రదేశం లో కొన్ని గేదలు గడ్డిమేస్తూ కనిపించాయి. అయితే అదే సమయంలో ఆకలితో ఉన్న కోమడో డ్రాగన్ దూరం నుంచి వాటిని గమనిస్తూ ఇక అటువైపుగా దూసుకు వచ్చింది. ఈ క్రమంలోనే గేదెల మందపై అటాక్ చేసింది. అయితే వాటిలో ఒక చిన్న గేదెను నోట కరుచుకునేందుకు వెళ్ళింది. ఇక ఇంతలోనే కోమడో డ్రాగన్ రాకను గమనించిన గేదలన్ని దూరంగా పరుగులు పడితే.  మందలోని ఒక గేదె మాత్రం ఏకంగా కోమడో డ్రాగన్ పైకి దూసుకుపోయింది  ఏకంగా దానితో హోరాహోరీ పోరాటం చేయడానికి సిద్ధమైంది. అయితే సదరు గేదె ఇక కొమ్ములతో దాడి చేయగా కోమడో డ్రాగన్ దూరంగా పారిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: