వైరల్:కోచింగ్ సెంటర్ల పైన కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు..!!

Divya
చాలామంది విద్యార్థులు, యువత సైతం ఎక్కువగా తమ కలలను సాధించాలని ఉన్న ఊరు నుంచి దూరమైన ప్రాంతాలకు వెళ్లి అక్కడ కోచింగ్ సెంటర్లు కు వెళ్లి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.. అయితే ఇదే అదునుగా చేసుకొని కొంతమంది కోచింగ్ సెంటర్లు విద్యార్థులకు సౌకర్యాలు లేని వంటి వాటితో అధిక ఫీజులు గుంజుతూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. ఇటీవల కాలంలో చాలామంది విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మహత్యలు కూడా కోచింగ్ సెంటర్లలో జరిగిన సందర్భాలు చూసిన కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా ఉండేటువంటి కోచింగ్ సెంటర్లకు నూతన మార్గాలను కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.16 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న విద్యార్థులను సైతం కోచింగ్ సెంటర్లలో అసలు చేర్చుకోకూడదంటూ తెలిపింది. సెకండరీ పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న తర్వాతే విద్యార్థులకు సైతం చేర్చుకునేలా అనుమతులు ఇచ్చింది.. అంతేకాకుండా శిక్షణ కేంద్రాల తరగతులలో విద్యార్హత కలిగిన సిబ్బందులను నియమించాలని కచ్చితంగా వారి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి డిగ్రీ కంటే తక్కువ అభ్యసించిన వారికి నియమించకూడదని ఉత్తర్వులను కూడా జారీ చేసింది.

అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసే విధంగా ర్యాంకులు మార్కుల గురించి ఎలాంటి హామీ కూడా ఇవ్వకూడదని తెలిపారు.
కోచింగ్ సెంటర్లు ఇచ్చే శిక్షణకు సంబంధించి అక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు ఫలితాల గురించి మోసపూరిత ప్రకటనలు చేయకూడదు.

అగ్ని ప్రమాదము సంభవించినప్పుడు ప్రాణనష్టం నివారించేందుకు పలు రకాల భద్రత ప్రమాణాలను పాటిస్తూ ఉండాలి.
ఎవరైనా శిక్ష నిచ్చే వ్యక్తి లేదా కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తే మూడు నెలల లోపే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

 కోచింగ్ తీసుకొని విద్యార్థులకు సైతం మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు పలు రకాల కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది.

ఒకే పేరుతో ఎన్నో రకాల ప్రాంతాలలో శిక్షణ ఇచ్చే సంస్థలు కూడా ఆయా బ్రాంచీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించాలని తెలిపారు. వీటితోపాటు నాణ్యమైన వాటన్నిటినీ కూడా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: