ముగ్గుల్లో గోబ్బేమ్మలు పెట్టడానికి గల ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?

Divya
సంక్రాంతి వచ్చిందంటే చాలు ఎటు చూసినా ముగ్గులు, పిండి వంటలు,కొత్త బట్టలతో సంబరాలను హోరెత్తిపోయేలా చేసుకుంటారు.ఈ పండుగ చేసుకున్నంత అట్టహాసంగా ఏ పండుగా నిర్వహించుకోరు.మరి ముఖ్యంగా పెళ్లికాని ఆడపిల్లలు ధనుర్మాసం అంతా ముగ్గులు వేసి,నోములు నోచి,వారికి మంచి భర్త కావాలని కోరుకుంటూ ఉంటారు.అంతేకాక రైతులు తమ పండించిన పంటలను ఇంటికి తెచ్చి,కొత్త పొంగలను పెట్టి,ముగ్గులు వేసుకొని సంబరాలు చేసుకుంటారు.అలాంటి సంబరాల్లో ముగ్గులలో గొబ్బెమ్మలను అలంకరించడం కూడా మన ఆనవాయితీనే.అసలు గొబ్బెమ్మలని ఎందుకు పెడతారో తెలుసా.. మరి ఆ విశేషం ఏంటో తెలుసుకుందామా..
సాధారణంగా ధనుర్మాసంలో నెల అంతా ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెడతారు.మధ్యలో ఉన్న గొబ్బెమ్మను శ్రీకృష్ణుడు గాను,చుట్టూ ఉన్న గొబ్బెమ్మలను గోపికలగాను వర్ణిస్తారు.ఈ సమయంలో శ్రీకృష్ణుడు గోపికలు చుట్టూ చేరి,ఆయన  లీలలను చూపిస్తూ ఉంటాడు.అంతే కాక ప్రేమానురాగాలను కూడా కురిపిస్తూ ఉంటాడు.మరియు ఈరోజున అంటే సంక్రాతి రోజున దక్షిణాయన కాలం వెళ్ళిపోయి ఉత్తరాయన కాలం వస్తుంది.కనుక ఆ సమయంలో దేవతలు వారి వరాలను కురిపిస్తారు.ఆ సమయంలో పెళ్లి కాని ఆడపిల్లలు ఇష్టగా వ్రతం ఆచరించి,దేవతలను వేడుకున్నట్లయితే వారికి మంచి భర్త రావడమే కాక,వారి సౌభాగ్యం కూడా కలకాలం ఉంటుంది.మరియు గోబ్బేమ్మలను పెట్టిన వారి ఇంట్లో ధన్యలక్ష్మి కూడా అడుగుపెట్టి,వారికి ఎలాంటి దరిద్రం అడుగుపెట్టకుండా కాపాడుతుంది.
ఈ మాసాన్ని అనుసరించే గోదాదేవి రంగనాథుని కృపకు గురవుతుంది.అంతేకాక రైతులు తాము పండించిన పంటలను గోబ్బేమ్మలలో నింపి పెట్టడం వల్ల,వారి ఇంట్లోకి ఎలాంటి కీడు రాకుండా ఉంటుందని భావిస్తారు. అందులో ముఖ్యంగా గొబ్బెమ్మలు నింపడానికి నవధాన్యాలు అంటే రాగులు,సజ్జలు,జొన్నలు,గోధుమలు,గుమ్మడి గింజలు,బియ్యం,అలసందులు,పెసలు,నువ్వులు వేసి గొబ్బెమ్మలలో నింపుతారు.ఇలా నింపిన తర్వాత వీటికి పూజలు నిర్వహించి,గుమ్మడికాయ కొడతారు.
ఈ మాసం అంతా గొబ్బెమ్మలను పెట్టిన తర్వాత,భోగి రోజు ఆ గొబ్బెమ్మలను తీసుకువెళ్లి భోగి మంటలలో వేస్తారు.ఇలా ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను మంటలలో వేసినప్పుడు,మంట నుంచి వచ్చే పొగ వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా మరియు వైరస్లను చంపడంలో ముందుంటుంది.కావున ప్రతి ఒక్కరూ సంక్రాంతి వేల కచ్చితంగా ఆవు పేడతో గొబ్బెమ్మలను పెట్టి,పశుపక్షాదులను పూజించడం కూడా చాలా ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: