ఈ గొర్రెకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో కానీ.. ఒలంపిక్స్ పంపిస్తే గోల్డ్ మెడల్ ఖాయం?

praveen
మనుషుల లాగానే కొన్ని జంతువులు కూడా ఎంతో తెలివిగా ఆలోచిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా తెలివిగా ఆలోచిస్తూ ఆయా జంతువులు చేసే పనులు కొన్ని కొన్ని సార్లు మనుషులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఇక ఇలాంటిది ఏదైనా జరిగిందంటే చాలు నేటి రోజుల్లో సోషల్ మీడియాలో వాలిపోతూ.. ఇక ప్రపంచం మొత్తం పాకి పోతుంది. ఇక సోషల్ మీడియా కారణంగా ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు మనుషులు. ఇక్కడ ఒక గొర్రె చేసిన విన్యాసం చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు.

 ఏకంగా ఒలంపిక్స్ లో క్రీడాకారులు చేసినట్లుగానే ఇక్కడ ఒక గొర్రె సాహసం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి ప్రతి ఒక్కరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. బయటకు వెళ్లిన గొర్రెలు వాటి మంద వద్దకు ఆలస్యంగా వస్తాయి. అయితే అప్పటికే యజమాని మిగతా గొర్రెలు అన్నింటినీ కూడా ఒకచోటకి చేర్చి ఇక గేటు వేస్తాడు. అయితే ఆలస్యంగా రావడానికి తమ యజమాని చూస్తే ఎక్కడ కొడతాడో అని ఆ గొర్రెలు భయపడతాయి.

 ఎలాగైనా మిగతా గొర్రెల మందను ఉంచిన చోటుకు వెళ్లాలి అని అనుకుంటూ ఉంటాయి. అయితే ముందు భారీ కంచ కనిపించిన కూడా ఆ గొర్రెలు ఎక్కడ వెనకడుగు వేయవు. ఏకంగా సాహసం చేసి ఎంతో ఎత్తు ఉన్న కంచె పైనుంచి లోపలికి దూకుతుంది ఒక గొర్రె. అయితే ఈ సాహసాన్ని సినిమాల్లో చూసి నేర్చుకుందో లేదంటే ఒలిపిక్స్ జరుగుతున్నప్పుడు టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూసిందో గానీ ఈ గొర్రె చేసిన సాహసం చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. సినిమాల్లో ఇలాంటివి చూసాం. కానీ రియల్ లైఫ్ లో ఇలాంటిది ఇప్పటివరకు చూడలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: