కుక్క ప్రాణాలు కాపాడిన పెళ్లి.. వీడియో వైరల్?

praveen
మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి దూసుకు వస్తుంది అన్నది ఊహించని విధంగానే ఉంటుంది. కేవలం మనుషుల విషయంలోనే ఈ భూమి మీద ఉన్న అన్ని జీవుల విషయంలోనూ ఇక ఈ రూల్ వర్తిస్తూ ఉంటుంది అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు ఊహించని రీతిలో మృత్యువు దూసుకు వచ్చినప్పుడు ఆపద్బాంధవుడి లాగా ఇక ప్రాణాలను రక్షించేవారు వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరహా ఘటన ఏదైనా జరిగిందంటే నేటి టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియాలో వాలిపోవడం జరుగుతూ వస్తుంది.

 అయితే ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. సాధారణంగా కుక్క పిల్లి మధ్య పుట్టుకతోనే జాతి వైరం కొనసాగుతూ ఉంటుంది. ఈ రెండు ఎదురుపడ్డాయి అంటే చాలు ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటాయ్. ఇక ఏదో ఒకటి ప్రాణాలు కోల్పోయే వరకు కూడా పోట్లాడుకుంటూనే ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో మాత్రం జాతి వైరం ఉన్న ఈ జంతువులు కూడా స్నేహితుల్లా మారిపోతూ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇక్కడ ఏకంగా ప్రమాదంలో ఉన్న ఒక కుక్కని పిల్లి కాపాడింది. ఆపద్బాంధవుడులా వచ్చి ఆదుకుంది. ఓట్ల హోమాలోనే హెడ్మాండలో ఇంట్లో కుక్క పిల్లి తో కలిసి నివసిస్తుంది. అయితే ఒక రోజు వాటి పెరట్లోకి ప్రవేశించిన కోయేట్ కుక్కపై దాడి చేసింది. అయితే ఆ కుక్క పేరు ఓక్లే. అది 6 ఏళ్ల వైట్ హవా నీస్ డాగ్.ఇక కుక్క బొమ్మలా కనిపించే చిన్న సునీతమైన కుక్క. కీయెట్ లు తోడేలు లాగా ఉంటాయి. అయితే కుక్క యజమాని  డయర్ నవంబర్ 30న అర్ధరాత్రి సమయం మూత్ర విసర్జన చేయడానికి కుక్కను బయటకు పంపాడు. అయితే సమీపంలో ఉన్న ఒక కోయట్ ఏకంగా ఆ చిన్ని కుక్కపై దాడి చేసింది.  కానీ ఊహించని రీతిలో అక్కడికి దూసుకు వచ్చిన పిల్లి కోయట్ ను అక్కడ నుంచి తరిమికొట్టి కుక్క ప్రాణాలను కాపాడింది. ఈ వీడియో సిసి కెమెరాలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: