ఇష్టపడి నూడిల్స్ తింటున్నారా.. ఈ వీడియో చూస్తే ఇక ముట్టనే ముట్టరు..!!
నూడిల్స్ ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినప్పటికీ కూడా దాన్ని మాత్రం వదలరు.. తాజాగా నూడుల్స్ తినేవారికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత నూడుల్స్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ వీటిని తినడానికి ఆలోచిస్తారు. అందరినీ షాక్‌కు గురి చేసే ఆ వీడియో గురించి తెలుసుకుందాం.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అతి తక్కువ సమయంలోనే వండుకునే వంటకం.. ఈ నూడిల్స్ అందుకే త్వరగా ఆకలితో ఉన్నవారు వీటిని ఎంచుకుంటూ ఉంటారు. మ్యాగీ ఇప్పి తధాతరవి ఈ కోవకే చెందినవి.. నూడిల్స్ మాత్రం వీధి వ్యాపారుల వద్ద కూడా ఎంతో ఇష్టంగా ప్రజలు తింటూ ఉంటారు. వ్యాపారుల వద్ద దొరికే నూడిల్స్ ను చౌ మెయిన్ నూడిల్స్ గా పిలుస్తారట.. ఈ నూడిల్స్ కు సంబంధించిన విడియోలో పరిశీలిస్తే.. నది దగ్గర చాలామంది ఉంటారు. ఆ సమయంలో ఒక వ్యక్తి తన చేతిలో ట్రే పట్టుకొని నది వద్దకు వెళ్లడం గమనించవచ్చు. నది నీటిలో ఆ ట్రే ముంచారు .అయితే అతడు ఏదో ముంచాడు క్యాజువల్ గాని ముంచినట్టుగా కనిపిస్తుంది.. కానీ బాగా పరిశీలిస్తే అందులో నూడిల్స్ కనిపిస్తాయి. ఇలా నదిలో పారే నీళ్లలో నూడిల్స్ కడిగాడం అలాగె వాటిని వండి కస్టమర్లకు వడ్డించాడం వంటివి జరుగుతోందట.. అయితే నూడిల్స్ ని సైతం ఉడికించిన తర్వాత వ్యాపారస్తులు ఇలా చల్లనీలతో నూడిల్స్ ని కడుగుతారని తెలుస్తోంది.అయితే నూడిల్స్ ని మంచి నీటితో కడగాలి కానీ నదిలో కడగటంతో ప్రజల సైతం ఫైర్ అవుతున్నారు.