వైరల్ వీడియో.. ఈ కొరియర్ బాయ్ నిజంగా గ్రేట్ గురూ.. ఎందుకంటే?

praveen
లిఫ్ట్‌లలో చాలామంది ఇరుక్కుని ప్రమాదానికి గురవుతూ ఉంటారు. కొన్ని సమయాల్లో మనం లోపల ఉండగా లిఫ్ట్‌లు ఆగిపోతూ ఉంటాయి. కరెంట్ పోవడం లేదా మొరాయించడంతో నిలిచి పోతూ ఉంటారూ. ఇలాంటి సమయం లో లోపల ఉన్నవారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక చిన్న పిల్లలు ఉంటే మరింత ప్రమాదం జరుగుతుంది. అయితే లిఫ్ట్‌లో చిక్కుకున్న మహిళతో పాటు పసి బిడ్డను ఒక కొరియర్ బాయ్ రక్షించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఒక మహిళ చంటి బిడ్డతో కలిసి లిఫ్ట్ లో వెళుతుంది. ఆ లిఫ్ట్ లో కొరియర్ బాయ్ కూడా ఉన్నాడు. అయితే లిఫ్ట్ ఒక్క సారిగా ఆగి పోయింది. అంతే కాకుండా లిఫ్ట్ కుదుపులకు లోనైంది. దీంతో చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్న మహిళ భయపడి లిఫ్ట్ మూలకు వెళ్లి నిల్చుంది. దీంతో లిఫ్ట్ లో ఉన్న కొరియర్ బాయ్ కుదుపులకు పడి పోకుండా తల్లీబిడ్డను పట్టుుకున్నాడు. కిందపడిపోకుండా తల్లీబిడ్డను తన చేతు లతో గట్టిగా పట్టుకున్నాడు. అలాగే డోర్లు తెరిచేందుకు ప్రయత్నించాడు. చివరికి డోర్లు తెరుచుకోవడంతో ముగ్గురు లిఫ్ట్ నుంచి బయటపడ్డారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్  మీడియాలో వైరల్ గా మారింది. దీంతో కొరియర్ బాయ్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. సమయస్పూర్తి ప్రదర్శించి చంటిబిడ్డతో పాటు మహిళను కాపాడాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవుడి ఎక్కడ నుంచో రాడని, కొరియర్ బాయ్ రూపంలో వచ్చాడని మరికొందరు కితాబిస్తున్నారు. కొరియర్ బాయ్ రియల్ హీరో అని మరికొందరు ప్రశంసిస్తున్నారు.అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. కానీ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అలాగే వేలల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి ముగ్గురు సురక్షితంగా లిఫ్ట్ నుంచి బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: