నీటి అడుగున పెళ్లి.. లవర్స్ ఆలోచన అదుర్స్?

praveen
పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో చాలా ముఖ్యం. జీవితంలో ఒకేసారి చేసుకుంటారు కాబట్టి ప్రతిఒక్కరు ఆ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలంటుకుంటారు. డబ్బు ఉన్నా, లేకున్నా పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేసుకోవాలంటుకుంటరు. పెళ్లి అంటే మాములు సందడి ఉండదు. ఇంట్లో పెళ్లంటే భాజాలు, భజంత్రీలు, కళ్యాణమండపం, విందుభోజనం, బంధువుల హడావిడి, ట్రిప్పులు, సెలవులు ఇలా ఎన్నో ఉంటాయి. కొంత మంది డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకుంటారు. బీచ్ లకి దగ్గరగా, హెలికాప్టర్ లలో జరిగిన వివాహాలెన్నో మనం విన్నాం. సోషల్ మీడియా వీడియోల్లో చూసాం. అయితే ఒక ప్రేమ జంట మాత్రం నీటి అడుగున వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసారు. ఈ వివాహం ఎక్కడ జరిగిందో తెలుసా. పోలాండ్‌లో జరిగిన ఈ వివాహం ఇప్పుడు వైరల్ అవుతుంది.
పోలండ్‌కు చెందిన ఎవా స్టారోన్స్కా, పావెల్ బుర్కోస్కి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అందరిలా కాకుండా జీవితాంతం వీరి పెళ్లి గుర్తుండిపోవాలి అనుకున్నారు. అందుకే అండర్ వాటర్ లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ నీటి అడుగున జరిగిన పెళ్ళికి 300 అతిధులు హాజరయ్యారు. ఈ పెళ్లి గ్రాండ్ గా, విజయవంతంగా జరగడానికి 300 మంది డ్రైవర్లు సహాయం చేసారంట. ఈ ప్రేమ పెళ్లి అతిపెద్ద జలాశయం నీటి అడుగున జరిగింది. ఈ వివాహం 18 నిమిషాల పాటు జరిగింది. వివాహం చేసుకున్న జంట, పూజారి వాటర్ ప్రూఫ్ టెక్స్ట్‌లు సంకేత భాష వ్యవస్థను ఉపయోగించి నీటి అడుగున పరస్పరం సంభాషించుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. వావ్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎన్నో పెళ్లిళ్లు చూసాం కానీ ఇలా నీటి అడుగున పెళ్లి చూడడం ఇదే మొదటిసారి అని కామెంట్లు పెడుతున్నారు. నీటిలో కూడా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అదిరిపోయేలా రెడీ అయ్యారని మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: