అరెరే కోతికి కూడా.. పానీపూరి పిచ్చి పట్టుకుందే?
పానీపూరి అంటే తెలియని వారుండరేమో. సాయంత్రం అయితే చాలు పానీపూరి బండి దగ్గర అమ్మాయిలు, పిల్లలు గుంపు గుంపుగా కనిపిస్తుంటారు. భయ్యా థోడా ప్యాజ్ దాలో అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. పానీపూరి అంటే ఇష్టం ఉందని వారుండరేమో. ఎక్కడ బండి కనిపిస్తే అక్కడికి వచ్చేస్తారు. పానీపూరి తింటూ పానీ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. పానీపూరికి రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది. అయితే ఇప్పుడు పానీపూరి తినడం వైరల్ అవుతుంది. గుజరాత్‌లోని టంకారా ఓ కోతి పానీపూరి బండి వద్దకు వచ్చి పానీపూరి తింటుంది. కోతి గోల్గప్పల ప్లేట్‌ను ఆస్వాదిస్తూ కనిపిస్తుంది. కోతి గొల్గప్ప అమ్మవారి స్టాల్ వద్దకు వచ్చి దాని పైన కూర్చుంది. ఆ వ్యక్తి గోల్గప్పల పళ్ళెం సిద్ధం చేసి అక్కడ పెట్టాడు. అక్కడికి వచ్చిన కోతి కూర్చొని గోల్గప్పని తింటుంది. ఈ ఘటన టంకరలోని దయానంద్ చౌక్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన చూడడానికి జనాలు స్టాల్ దగ్గర గుమిగూడారు. ఈ వీడియోని వారి మొబైల్స్ లో రికార్డు చేసి ఆ వీడియోని వైరల్ చేసేసారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కోతి మనుషులకంటే బాగా పానీపూరి తింటుందని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. వైరల్ వీడియోలు చూడడం అలవాటు మీకు ఉందా. అయితే మరెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోని ఒకసారి చూసేయండి. ఆ తరువాత కామెంట్ కూడా పెట్టేయండి.