బాహుబలి సీన్ రిపీట్ చేసిన కోతి.. ఏం చేసిందో చూడండి?

praveen
దర్శకతీరుడు రాజమౌళి తెరకెక్కించే  సినిమాలు అటు ప్రేక్షకులు అందరిని కూడా అబ్బురపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి. పని రాక్షసుడిగా పేరు సంపాదించుకున్న రాజమౌళి ఇక తనకు నచ్చినట్లుగా షాట్స్ తెరకెక్కించేందుకు హీరోలను తెగ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక తనకు నచ్చినట్లుగా వచ్చేవరకు కూడా టేక్స్ తీసుకుంటూనే ఉంటాడు. అందుకే రాజమౌళితో సినిమా అంటే క్రేజ్ వస్తుంది అని హీరోలు ఇష్టపడిన.. ఇక ఆయన హీరోలను కష్టపెట్టే విధానం గురించి తెలిసి కొంత మంది భయపడిపోతూ ఉంటారు అని చెప్పాలి.

 ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులను అబ్బురపరిచింది. ముఖ్యంగా అనుష్క కోటపై దాడి చేసేందుకు సైన్యం వచ్చినప్పుడు ఇక బాహుబలి అనుష్కను రక్షించేందుకు చేసే విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఆవుల మంద పరిగెడుతున్న సమయంలో ఇక ప్రభాస్ ఏకంగా ఆవుల మందం మీద నుంచి దూసుకుపోయిన సన్నివేశం అయితే అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇక ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఇలాంటి తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 అయితే ఈ సీన్ ని రిపీట్ చేసింది మనిషి కాదు ఒక కోతి.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఆటో యజమాని బండారు విజయ్ కుమార్ ఆటో కిరాయికి వెళ్తుండగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో మేకల మందపై బాహుబలి స్టైల్ లో ఒక కోతి విన్యాసాలు చేసింది. ఇక ఇదంతా ఫోన్లో వీడియో తీసిన ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. రోజు మేతకు అడవిలోకి వెళ్లే మేకల మందకు కోతి పరిచయమైంది. అప్పటి నుంచి ఇక మేకలతోనే ఉంటూ వాటిపై పెత్తనం చెలాయిస్తూ ఇక ఇలా రాజసం చూపిస్తుందట ఆ కోతి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: