హోం మేడ్ ఏసి.. ఖర్చు కేవలం 10 రూపాయలే?
అయితే ఎండాకాలం కావడంతో అటు కూలర్లకు ఎక్కువగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో కూలర్ల రేట్లు కూడా అంతకంతకు పెరిగిపోయాయి అని చెప్పాలి. దీంతో చల్లటి గాలిని ఇచ్చే కూలర్ ని కొనుగోలు చేయడం కూడా సామాన్యుడికి భారంగానే మారిపోయింది. అయితే వేల రూపాయలు పెట్టి కూలర్ ని కొనాల్సిన అవసరం లేదు చిన్న ఆలోచన చేస్తే చాలు హోం మేడ్ ఏసి ని తయారు చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఇటీవల ఒక వ్యక్తి నిరూపించాడు.
ఒక వ్యక్తి కేవలం పది రూపాయల ఖర్చుతో పాత కూలర్ తో ఏసీ ని తయారు చేసుకున్నాడు. అతను ఎలా హోం మేడ్ ఏసిన తయారు చేశాడు అన్న దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో చూస్తే అతను కొన్ని పగిలిన కుండలను ఉపయోగించాడు. మట్టి కుండలను పగలగొట్టి ఆ పెంకులను పాడైపోయిన పాత కూలర్ అడుగున వేశాడు. ఆ తర్వాత ఒక కుండను కూలర్ మధ్యలో పెట్టి దానిలో ఒక పైప్ నీటి ద్వారా పంపుతున్నాడు. అందులోనే మరో పై ద్వారా కూలర్ చుట్టూ ఉన్నగడ్డి తడిచేలా ఏర్పాటు చేశాడు. తర్వాత కూలర్ ఆన్ చేశాడు. తర్వాత ఏం జరిగిందో వీడియోలో మీరే చూడొచ్చు. ఇలా పది రూపాయల ఖర్చుతో హోం మేడ్ ఏసీ తయారు చేశాడు. ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు.