వైరల్ : తల తెగిపడినా.. ఆ పాము పౌరుషం తగ్గలేదుగా?

praveen
సాధారణంగా మనుషుల్లో చాలామంది ఎదుటివారి ముందు తలవంచి బ్రతకడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొంతమంది అడుక్కుతిన్న పర్వాలేదు కానీ ఎదుటివారి ముందుతలవంచే ప్రసక్తి లేదు అని పౌరుషంతో  బ్రతుకుతూ ఉంటారు. చచ్చిన బ్రతికిన పౌరుషంతోనే ఉంటాము అని అంటూ ఉంటారు. అయితే కేవలం మనుషుల్లోనే కాదు అటు పాముల్లో కూడా ఇలాంటి పౌరుషంతో ఉండే పాములు ఉంటాయి అనే నిరూపించేలా కొన్ని కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఏకంగా విషపూరితమైన పాములు తమకంటే బలమైన పాములతో పోట్లాడటం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం.



 సాధారణంగా అయితే పాములు అవి ఉన్న పరిసరాల్లో ఏదైనా అలజడి కలిగింది అంటే చాలు వెంటనే అక్కడి నుంచి పారిపోతూ ఉంటాయి. ఒకవేళ తమపైనే దాడి జరుగుతుందని తెలిస్తే ఆత్మ రక్షణ కోసం ఏం చేయడానికైనా తెగిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక పాముకు తల తెగిపడింది. కానీ ఆ పాములో ఉన్న పౌరుషం మాత్రం ఎక్కడా తగ్గలేదు. తల తెగిపడిన తర్వాత కూడా ఏకంగా శత్రువులపై దాడి చేసేందుకు ఎప్పుడు అప్రమత్తంగానే ఉంది.కానీ పొరపాటున ఆ పాము శత్రువు అనుకుని తనను తానే కాటు వేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదిక వైరల్ గా మారిపోయింది.



 ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో తల తెగిపడిన పాము తనను తాను కాటు వేసుకోవడం చూడవచ్చు. సాధారణంగా పాము చనిపోయిన తర్వాత కూడా దాని శరీరం కదులుతూనే ఉంటుంది. ఇక్కడ ఎంతో విషపూరితమైన రక్తపింజర పాము తల తెగిపడి పక్కనే పడింది. అయితే దాని శరీరం మాత్రం కదులుతూ ఉంది. ఒకసారిగా ఇక పాము శరీరం ఇక తెగిపడిన తలకు తగలడంతో ఇక పాము పౌరుషంతో ఏకంగా కాటు వేసేందుకు ప్రయత్నించింది. కానీ అలా తగిలింది తన శరీరమే అని మాత్రం గ్రహించలేకపోయింది. ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు.  తల తెగిపడిన ఆ పాము పౌరుషం మాత్రం తగ్గలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: