సోషల్ మీడియాలో ఎంత పెద్ద
సూపర్ స్టార్ అయినా ఖచ్చితంగా ట్రోలింగ్‌కు గురి కావాల్సిందే.
సినిమా స్టార్లని
నెటిజన్స్ ఓ రేంజిలో ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటూ ఉంటారు.ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాతో చాలా దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఇక ఆయన పర్సనల్ విషయాలు, విడాకులు ఇంకా అలాగే ఫ్యామిలీ ఫోటోల మీద చాలా దారుణమైన నెగెటివ్ కామెంట్లు వస్తుంటాయి.
షారుఖ్ ఖాన్ మీద ఇది వరకు చాలా ట్రోల్స్ వచ్చాయి.అయితే పఠాన్ షారుఖ్‌ని నిలబెట్టేసింది.ఇక
సల్మాన్ ఖాన్ తాజాగా నెట్టింట్లో ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. మామూలుగా ఆ మధ్య
సల్మాన్ ఖాన్ స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. కాళ్ల నొప్పులు ఉన్నట్టుగా ఇంకా కొత్త ప్యాంట్ కొంటే టెస్ట్ చేసినట్టుగా ఆ స్టెప్పులు ఏంటి? అంటూ సల్మాన్ ఖాన్ ను ఓ రేంజిలో ట్రోల్ చేశారు. మొన్న
సల్మాన్,
వెంకీ ఇంకా
రామ్ చరణ్ కలిసి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. లుంగీకి, ధోతికి తేడా లేకుండా చేశారంటూ తెగ ట్రోల్స్ వేశారు.
ఇక ఇప్పుడు
సల్మాన్ ఖాన్ తాజాగా చాలా దారుణమైన నెగెటివ్ కామెంట్లకు గురవుతున్నాడు.
సల్మాన్ ఖాన్ వేసిన వింత స్టెప్పులు చూసి జనాలు పగలబడి నవ్వుకుంటున్నారు.
సల్మాన్ ఖాన్ వేసే మూమెంట్స్ ఎప్పుడూ కూడా చాలా కామెడీగానే ఉంటాయన్న విషయం తెలిసిందే. అంతగా డ్యాన్స్ రాని సల్మాన్ ఖాన్ ఏదో కష్టపడి తనకు వచ్చిన స్టెప్పులనే తిప్పి తిప్పి మళ్ళీ వేస్తాడు.ఇప్పుడు కిసీ కా భాయ్ కిసీ కా
జాన్ సినిమాలో కూడా అవే స్టెప్పులు వేశాడు.ఇక ఈ సినిమాను తమిళంలో వచ్చిన వీరమ్ సినిమాకు
రీమేక్ అని అంటున్నారు. ఇదే సినిమాను తెలుగులో కాటమరాయుడు అని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ డబ్బింగ్ అయిన సినిమాని
రీమేక్ చేసి నవ్వులు పాలైన సంగతి తెలిసిందే. అయితే మరి
సల్మాన్ తీసిన ఈ
సినిమా ఆ సినిమాకు రీమేకా? కాదా? అన్నది ఇంకో రెండు మూడు రోజుల్లో తేలబోతుంది. ఈ సినిమాను ఏప్రిల్ 21 వ తేదీన రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.