
వైరల్ : రియల్ బాహుబలి.. కారును పక్కకు జరిపేసాడు?
ఈ క్రమంలోనే ఇక ఒకరు నిర్లక్ష్యంగా వాహనాన్ని పార్క్ చేయడం కారణంగా ఇక ఎంతోమంది ఇబ్బంది పడటం లాంటి ఘటనలు ఇప్పటివరకు ఎంతోమంది చూసే ఉంటారు. మరి కొంతమంది ఇలాంటి ఘటనలను అనుభవించి కూడా ఉంటారు. అయితే ఇక్కడ ఒక యువకుడికి ఇలాంటి అనుభవమే ఎదురయింది. దీంతో అతను చేసిన పని కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అతను ఒక ఇరుకైన రోడ్ లో కార్ తో వెళ్తున్నాడు. అయితే ఆ ఇరుకైన రోడ్ లో మారుతి సుజుకి వ్యాగనార్ కారును ఎవరో అడ్డదిడ్డంగా పార్క్ చేశారు.
దీంతో సదరు ఇరుకైన రోడ్డులో ఆ కారుని దాటుకొని వెళ్లడం ఇబ్బందిగా మారిపోయింది. కాగా ఇక రోడ్డు గుండా వెళ్తున్న ఒక వాహనదారుడు అది గమనించి కారు నుంచి బయటకు దిగాడు. దీంతో అతను ఏం చేస్తాడా అని మొదట ఎవరికీ అర్థం కాలేదు. చివరికి తప్పుగా పార్క్ చేసి ఉన్న కారు వద్దకు వెళ్లి ఎవరి సహాయం లేకుండానే కారును కేవలం తన రెండు చేతులతో పక్కకు జరిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి అతను నిజంగా రియల్ బాహుబలి అని అందరూ కామెంట్లు చేస్తున్నారు.