రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త.. అవి పెంపు..!!
అయితే ఈ పథకాన్ని ఈ ఏడాది చివరి వరకు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇవ్వలేదు.. దీంతో మూడు నెలలుగా లబ్ధిదారులకు కేవలం 5 కేజీలు చొప్పున మాత్రమే రేషన్ బియ్యం లభిస్తోంది ..అయితే ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల ఒకటవ తారీఖు నుంచి అదనంగా ఒక కిలో బియ్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక మనిషికి 6 కేజీలు చొప్పున బియ్యం అందించనున్నారు.. దాదాపుగా 3,25,545 రేషన్ కార్డులు ఉన్నాయని వీరందరికీ లబ్ధి చేకూర్చేలా చేస్తున్నట్లు.
చౌక ధరల దుకాణాల ద్వారా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వాటాగా 5 కిలోలు రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.. ఈనెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద కిలో బియ్యం ని మొత్తం కలుపుకొని ఆరు కిలోలు చొప్పున రేషన్ బియ్యం సరఫరా చేయాలని జిల్లా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సూర్యాపేట పౌరసరఫరాల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.. అధికారులు 6 కిలోలు చొప్పున బియ్యం కోటాను రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల ఇందుకు సంబంధించి సరఫరా కూడా ప్రారంభమైందని తెలుస్తోంది