వైరల్ : అమ్మాయిలతో పెట్టుకుంటే అంతే.. సరదా తీరిపోద్ది?

praveen
సాధారణంగా అయితే బైక్ లేదా కారు నడపడం ఎంతో ఈజీ అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. ఒక్కరోజు వాహనం ఎక్కాము అంటే చాలు సాయంత్రం వరకు డ్రైవింగ్ నేర్చుకుంటాం అని ఎంతో మంది ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. కానీ ఇక అసలు విషయం ఏంటి అన్నది మాత్రం వాహనం ఎక్కి డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టిన తర్వాతే అర్థమవుతూ ఉంటుంది. డ్రైవింగ్ నేర్చుకోవడం  అనుకున్నంత సులువు కాదు అన్న విషయం అందరికీ అర్థమవుతూ ఉంటుంది అని చెప్పాలి. అబ్బాయిలతో పోల్చి చూస్తే అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పించడం మాత్రం కాస్త కష్టమే.

 కానీ యువకులు మాత్రం ఇక ఇలా అమ్మాయిలకు బైక్ డ్రైవింగ్ నేర్పించడానికి కాస్త ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇలా అమ్మాయిలకు అబ్బాయిలు బైక్ డ్రైవింగ్ నేర్పిస్తూ ఉండడం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో కూడా ఇలాంటి వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇలా అమ్మాయిలకు బైక్ డ్రైవింగ్ నేర్పించేటప్పుడు మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అన్నది ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే అర్థమవుతుంది.

 ఒక అమ్మాయికి బైక్ డ్రైవింగ్ నేర్పించాలి అనుకున్న యువకుడికి దిమ్మతిరిగిపోయింది. వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే.. ఓ కాలేజీ గ్రౌండ్లో అమ్మాయికి బైక్ నడపడం నేర్పుతాడు ఒక యువకుడు. అమ్మాయి ముందు కూర్చుంటే అతను వెనుక కూర్చొని ఎలా నడపాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. అయితే కొంత దూరం ఇద్దరు కలిసి మెల్లిగానే వాహనం నడుపుతారు. కానీ అప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఆ యువతి బ్రేక్ కి బదులుగా స్కూటీ ఎక్సలేటర్ ను ఒక్కసారి పెంచేస్తుంది. దీంతో బండి 3 వంకర్లు తిరిగి ఒక్కసారిగా కింద పడిపోతుంది. దీంతో ఇద్దరికీ గాయాలు అవుతాయి. ఇది చూశాక అమ్మాయిలతో పెట్టుకుంటే ఇంతే అంటూ కొంతమంది నేటిజన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: