వైరల్ : ప్రాంక్ చేశాడు.. గూబ పగిలిపోయింది?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ పంచడానికి మాత్రమే కాదు భారీగా ఆదాయం సంపాదించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే ఉద్యోగం వ్యాపారం చేయడం కాదు సోషల్ మీడియాలో ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నిస్తే చాలు ఒకవైపుకు పాపులారిటీకి పాపులారిటీ.. మరోవైపు భారీగా ఆదాయం కూడా పొందేందుకు అవకాశం ఉంటుందని ఎంతో మంది యువత భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం అని చెప్పాలి.

 ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎంతోమంది ఇలా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడానికి ఫ్రాంక్ వీడియోలను అస్త్రంగా మార్చుకుంటున్నారు. కొంతమంది ఏకంగా జనాలను ఇబ్బంది పెట్టే విధంగా ఫ్రాంక్ వీడియోలు చేస్తూ ఉండడం కూడా ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా ఫ్రాంక్ లు చేస్తున్న సమయంలో.. కొంతమంది చూసి చూడనట్లు వదిలేస్తూ ఉంటే.. మరి కొంతమంది మాత్రం సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉండడం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఫ్రాంక్ చేసేందుకు ప్రయత్నించగా గూబ పగిలిపోయింది అని చెప్పాలి.

 ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది అని చెప్పాలి. ఒక వ్యక్తి రోడ్డు మీద ఎంతో సీరియస్ గా నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. అయితే పక్కనే ఉన్న ఒక యూట్యూబర్ ఫ్రాంక్ చేయాలని ప్రయత్నిస్తాడు. ఏకంగా నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి చెవి దగ్గరికి వెళ్లి హార్న్ ఊదుతాడు. దీంతో ఇక సదరు వ్యక్తికి ఒక్కసారిగా కోపం నషాలానికి అంటుకుంటుంది. ఎంతో సీరియస్ గా మాట్లాడుతూ ప్రాంక్ స్టార్  దగ్గరికి వచ్చిన సదరు వ్యక్తి చెంప పగలగొడతాడు. ఆ తర్వాత తన దారిన తాను వెళ్ళిపోతాడు సదరు వ్యక్తి. ఈ వీడియో చూసి అతిగా ఫ్రాంక్ చేస్తే ఇలాగే ఉంటుంది అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: