సూర్యునిపై భారీ బిలం.. భూమికి ముప్పు?

Purushottham Vinay
సూర్యునిలో అంతర్గత మార్పుల పరిణామాల నేపథ్యంలోనే సూర్యుడి ఉపరితలంలో ఓ పెద్ద భారీ బిలాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఈ బిలం విషయానికి వస్తే ఇది ఏకంగా భూమి కన్నా 20 రెట్లు పెద్దదిగా ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) శాస్త్రజ్ఞుల అన్వేషణాక్రమలో కనుగొన్నారు.ఇక ఈ మధ్యకాలంలో అమెరికాలో ఆకాశంలో పలు రకాల వింతగా వుండే దట్టమైన కాంతులకు కారణం విషయానికి వస్తే.. అది సూర్యుడి బాహ్యావలయం కరోనా విస్పోటనంతో అయస్కాంత క్షేత్రాలకు ముప్పు వాటిల్లిందనే విషయం కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు భూమి సైజు కంటే పలు స్థాయిల్లో పెద్దగా ఉండే ఈ బిలం ఉన్నట్లు గుర్తించడంతో ఇది భూమిపై ఎటువంటి ప్రభావం చూపుతుందో అనే విషయం ఆందోళనకరమైన చర్చకు దారితీసింది.


ఇక ఇప్పుడు ఏర్పడ్డ ఈ భారీ బిలంతో ఇంతకు ముందు సూర్యుడి ఉపరితలంపై కన్పించే ఓ ప్రాంతం కన్పించని స్థితి ఏర్పడిందని తెలిపే నాసా అధ్యయన వివరాలను అమెరికాకి చెందిన ఓ ప్రముఖ పత్రిక తెలిపింది. అంతేగాక సూర్యుడిలో ఏర్పడ్డ భారీ బిలంతో జియోమాగ్నటిక్ తుఫాన్లు తలెత్తుతాయని అమెరికాకు చెందిన సముద్ర వాతావరణ పరిశోధనల విషయాల అధికారిక సంస్థ ఎన్‌ఒఎఎ హెచ్చరికలు జారీ చేసింది.ఇక ఇప్పుడు ఏర్పడ్డ ఈ భారీ బిలం వల్ల భూమి వైపు గంటకు 2.9మిలియన్ కిలోమీటర్ల వేగంతో సౌరగాలులు వీస్తున్నాయి. ఇవి భూమిని వచ్చే శుక్రవారం నాడు తాకుతాయని సైంటిస్టులు విశ్లేషించారు.కాబట్టి భూమిపై పలు పరిణామాలు సంభవించవచ్చు. ప్రత్యేకించి శాటిలైట్లు, మొబలై ఫోన్లు ఇంకా జిపిఎస్‌పై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ నెల 23వ తేదీనే నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (ఎస్‌డిఒ) నిపుణుల టీం సూర్యుడి కరోనాలో భారీ బిలం ఏర్పడిన విషయాన్ని గుర్తించింది.ఇక ఇప్పటికే పలు రకాల పర్యావరణ, వాతావరణ మార్పులతో భూమిపై పలు రకాల ప్రభావాలు పడుతున్న దశలో ఇప్పుడు ఇలా భూమికి ఈ సూర్యుడి బిలం నుంచి వెలువడే వాయువులతో ఏర్పడే ముప్పు ఎలా ఉంటుందో అనే కీలక ప్రశ్న శాస్త్రవేత్తల్లో మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

SUN

సంబంధిత వార్తలు: