పర్యాటకులను ఆకర్షిస్తున్న బెంగళూరు రోడ్స్..!!

Divya
పువ్వులు వికసించే కాలం వసంతకాలం అని చెబుతారు. ముఖ్యంగా పౌరులు వీధుల పక్కన నడవడం చూసి పార్కులను సందర్శించడం ద్వారా ప్రతి ఒక్కరు ఆకర్షించబడుతున్నారు. అసలు విషయంలొకి వెళ్తే.. మెత్తని గులాబీ రేకులు బెంగళూరు వీధుల్లో తివాచీలు వేయడం ప్రారంభించిన సంవత్సరంలా అనిపిస్తోంది. ఈ పువ్వులను చూస్తే అప్పుడే వసంత రుతువు ప్రారంభం అయ్యిందా అన్నట్లు అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం నగరం తానంతట తానుగా గులాబీ రంగును పూసుకొని ఒక అద్భుతమైన సహజ దృగ్విశయానికి లోనవుతుంది.
రోడ్డుకి ఇరువైపులా ఎర్రటి తివాచీ పరిచినట్లు ఈ పువ్వులు అక్కడ ప్రజలను ఆకర్షిస్తున్నాయి.  ముఖ్యంగా సమీపంలోని టబెబుయా రోజెస్ చెట్లు ఉండడం వల్ల ఈ అనుభవం అందరికీ సంతృప్తిని కలిగిస్తోంది. వసంత ఋతువులు చెట్లు వికసించడం ప్రారంభిస్తాయి.  వాటి గులాబీ ప్రేమను అన్ని చోట్ల వ్యాపిస్తాయి. వికసించే కాలం వసంత కాలంలోనే ఉంది.  కానీ అందుకు ముందుగానే ఈ పువ్వులు వసంత కాలాన్ని తలపిస్తున్నాయి.
ఈ టబెబుయ చెట్లను మొదట బ్రిటీషర్లు బెంగళూరులో నాటారు. ఈ గులాబీ రంగు పువ్వులను చూస్తుంటే వసంత కాలాన్ని గుర్తు చేస్తుందని బెంగళూరు వాసులు చెబుతున్నారు. స్వాతంత్రం పొందిన తర్వాత బ్రిటిష్ వారు దేశం విడిచినప్పటికీ బెంగళూరులోని వివిధ ప్రాంతాలలో వారు నాటిన చెట్ల అందం ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. ముఖ్యంగా గులాబీ పూలతో నిండిన ఈ అందమైన చెట్లను చూడడానికి ఫోటోగ్రాఫర్లు తమ కెమరాలకు పనిపెట్టారు. ఐటీ హబ్ లోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో షట్టర్ బగ్ విప్లబ్ మహాపాత్ర తీసిన కొన్ని స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అద్భుతమైన చిత్రాలను పంచుకున్న ఒక ట్విట్టర్ వినియోగదారుడు తన ట్వీట్ లో ఈ ఫోటోల గురించి వెల్లడించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఈ పువ్వులు చూసి ప్రతి ఒక్కరు కూడా ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు.  మొత్తానికి అయితే ఈ చెట్లు అక్కడ ప్రాంతీయవాసులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: