ఆవులు గేదలు కాదు.. అక్కడ గాడిదలకే ఎక్కువ డిమాండ్?
ఏకంగా ఒక్కో గాడిదకు లక్ష రూపాయల వరకు ధర పలుకుతూ ఉంటుంది అని చెప్పాలి. ఒకవేళ గాడిదల్లో మేలు జాతికి చెందినవి ఉంటే.. ధర మరింత ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. అయినా ఇంత ధర ఉన్న గాడిదలను కొనేందుకు ఎవరు మార్కెట్ కి వస్తారు అని అంటారు. అక్కడ గాడిదలను కొనేందుకు వచ్చే జనాన్ని.. చూస్తే మాత్రం నోరెళ్ళబెట్టకు తప్పదు. ఎందుకంటే ఆ రేంజ్ లో తరలి వస్తూ ఉంటారు. మర్హి యాత్ర అహ్మద్ నగర్ జిల్లా పద్ధర్థి తాలూకాలో ఉంది. మార్కెట్లో గాడిదలతో మరికొన్ని జంతువులు కూడా అమ్ముతారు. కేవలం ఇది జంతువుల మార్కెట్ మాత్రమే కావడం గమనార్హం. ఇకపోతే గాడిదలకు స్పెషల్ మార్కెట్ అని పిలుచుకుంటూ ఉంటారు అందరూ. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ గుజరాత్ లాంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారాలు ఇక్కడికి వస్తూ ఉంటారు.
అయితే ఈ ఏడాది మార్కెట్లో కటెవాడి గాడిదల కోరత ఏర్పడిందట. అందుకే ఇక ఈ రేంజ్ లో డిమాండ్ ఏర్పడింది అన్నది తెలుస్తుంది. పంజాబీ హైబ్రిడ్ గాడిదకు లక్ష రూపాయల వరకు ధర ఉంటుందని అక్కడ వ్యాపారం చెబుతున్నారు. అయినప్పటికీ కోనేందుకు జనాలు వెనకడుగు వేయడం లేదు. మర్హి యాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. రంగ పంచమి రోజున నాథుని సమాధిని దర్శించుకుంటూ ఉంటారు. ఉదయం నుంచే భక్తులు పోటేత్తుతారు. అయితే కరోనా వైరస్ కష్టకాలం తర్వాత మొదటిసారి జరుగుతున్న యాత్ర కావడంతో భక్తులు సంఖ్య భారీగా పెరిగింది. దీంతో గాడిదలకు కూడా డిమాండ్ పెరిగింది అని చెప్పాలి. ఎందుకంటే ఈ యాత్రలో ప్రతి ఒక్కరు గాడిదలను ఉపయోగించే ప్రయాణం చేస్తూ ఉంటారు.