పెళ్లిలో చిన్నారి డాన్స్.. చూస్తే ఫిదా అవ్వాల్సింది గురు?

praveen
పెళ్లంటేనే సందడి.. తెలిసి తెలియని బంధుమిత్రులు స్నేహితులందరినీ కూడా పెళ్లికి ఆహ్వానిస్తూ ఉంటారు వధువు , వరుడు కుటుంబ సభ్యులు. దీంతో పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించడానికి అందరూ తరలి వస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న పెళ్ళికొడుకు పెళ్ళికూతురని కలకాలం సంతోషంగా ఉండాలి అంటూ ఇక ఇలా పెళ్లికి వచ్చిన పెద్దలు ఆశీర్వదించడం చూస్తూ ఉంటాం. అయితే పెళ్లి అంటే ఇటీవల కాలంలో మాత్రం తప్పని సరిగా డాన్సులు గట్రా ఉండాల్సిందే. అలాంటివి లేకుండా పెళ్లి జరుగుతుంది అంటే ఇక నేటి రోజుల్లో ఆ పెళ్ళికి వచ్చిన వారు కూడా బోరింగ్ గా ఫీల్ అవుతూ ఉన్నారు.

 ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో వధూవరులు ఇద్దరు కూడా తమ పెళ్లి మండపంలోకి డాన్సులు చేస్తూ ఎంట్రీ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఇక తమకు ఇష్టమైన పాటలపై డాన్స్ లు చేస్తూ అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఇక పెళ్లికి వచ్చిన అతిధులు అందరిని కూడా తమ డాన్స్ లతో ఫిదా చేసేస్తూ ఉన్నారు. కేవలం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మాత్రమే కాదండోయ్.. ఇక పెళ్లికి వచ్చిన అతిథులు సైతం ఇలా డాన్స్ లతో ఎంజాయ్ చేయడం లాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలోకి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్నారి పెళ్లివేడుకలో అద్భుతమైన డాన్స్ చేసింది.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి. హరియాన్వి సాంగ్ 52 గజ్ క ధమన్ సాంగ్ కి ఒక చిన్నారి మెస్మరైజింగ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసింది. అయితే డాన్స్ చేసేందుకు స్టేజి లాంటిది లేకపోయినా తాను ఉన్నచోటే ఇక ఆ చిన్నారి చేసిన డాన్స్ మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఈ వీడియోలో చూసిన నేటిజన్స్ ఆ చిన్నారి డాన్స్ చూసి ఫీదా అయిపోతున్నారు. అలాంటిది ఇక నేరుగా ఆ చిన్నారి డాన్స్ ను చూసిన అక్కడికి వచ్చిన అతిథులు కూడా ఫిదా అవ్వకుండా ఎలా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: