ఏయ్ నాన్న.. మా అమ్మను కొట్టకు.. చిన్నారి క్యూట్ వార్నింగ్?
ఇక తల్లిదండ్రులు ఎంత ఒత్తిడిలో ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన ఒక్కసారి తమ చిన్నారి కూతురు ప్రేమగా పలకరించింది అంటే చాలు ఒత్తిడి మొత్తం పోయి చిరునవ్వు పెదాలపై కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ ఒక చిన్నారికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఆ చిన్నారి మాట్లాడుతున్న తీరు చూసిన ప్రతి ఒక్కరికి ముచ్చటేస్తుంది అని చెప్పాలి. సాధారణంగా చిన్నపిల్లల ముందు తల్లిదండ్రులు కొట్టుకుంటున్న సమయంలో కొంతమంది పిల్లలు తల్లికి లేదా తండ్రికి వార్నింగ్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ముద్దు ముద్దు మాటలతో వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే ఎంతో క్యూట్ గా అనిపిస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఒక చిన్నారి ఇలాంటిదే చేసింది. ఏకంగా తన కూతురిని ఆటపట్టించడానికి ఒక తండ్రి చిన్నారి తల్లిని కొడుతున్నట్లుగా యాక్టింగ్ చేశాడు. అయితే ఇది గమనించిన చిన్నారి కోపంతో ఊగిపోయింది. ఏకంగా తండ్రికి వార్నింగ్ ఇచ్చింది. తండ్రికి వేలు చూపిస్తూ ఎంతో సీరియస్గా ముఖం పెట్టి ఇంకోసారి ఇంకోసారి మా అమ్మని కొట్టావనుకో చూడు అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఏకంగా తండ్రి చెంపపై గట్టిగా కొడుతుంది. ఇక తల్లిదండ్రులు కూడా ఆ చిన్నారి అలా వార్నింగ్ ఇస్తూ ఉంటే ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.