వైరల్ : పాముతో పెట్టుకుంటే అంతే.. సింహాలనే వణికించింది?
సాధారణం గా పాములు అంటే మనుషులు కూడా భయపడతారు. అయితే వాటికి కూడా చాలా భయం ఉంటుందన్న విషయం మాత్రం మరిచి పోతూ వుంటారు. అలాంటి పాముకి సింహం కూడా ఇక్కడ భయ పడడం వైరల్ అవుతున్న వీడియోలు చూడవచ్చు. అవును, వైరల్ అవుతున్న క్లిప్ లో ఏకం గా రెండు సింహాలను ఆ పాము గడగడ లాడించింది. అయితే అది నాగు పాము అని ఆ సింహాలకు కూడా తెలిసిందేమో గాని దాని ఉనికిని చూసి అడవి జంతువులను గడగడలాడించిన సింహాలు భయం తో వణికి పోవడం మనం చూడవచ్చు.
daniel_wildlife_photography అనే సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ ఐన ఆ వీడియో ఆహుతులను అలరిస్తోంది. కాగా ఇప్పటివరకు సదరు వీడియోకు ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ రాగా, వేల సంఖ్యలో లైక్స్ కొడుతున్నారు. ఇక కామెంట్లకైతే లెక్కేలేదు. ఎలాంటి బలవంతుడైనా అప్పుడప్పుడు ఓ బలహీనుడికి కూడా భయపడక తప్పదని ఒకరు కామెంట్ చేస్తే... కాలం ఎప్పుడు ఎవరి పక్షాన ఉంటుందో ఎవరికీ తెలియదు, అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అని ఒకరు కామెంట్ చేసారు. మరి మీకు ఆ వీడియోని చూస్తే ఏం అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.