ఒక్క అమ్మాయిని కలవకుండా 60 మందికి తండ్రైన వ్యక్తి?

Purushottham Vinay
ప్రస్తుతం బాగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించి పిల్లలకు కూడా జన్మనియొచ్చు. ఇక ఇదే విధంగా ఓ యువకుడు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 60 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. ఇంకా విచిత్రం ఏంటంటే అతను ఒక్క మహిళలను కూడా కలవకుండా ఇంకా టచ్ చేయకుండా ఏకంగా 60 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు.ప్రస్తుతం స్పెర్మ్ దానం చేసే ట్రెండ్ బాగా నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా స్పెర్మ్ బ్యాంకులు ఏర్పడటం ఇంకా స్పెర్మ్ దానం చేసేవారు సంఖ్య పెరగడం కూడా చాలా ఎక్కువగా జరుగుతోంది. చాలా మంది కూడా ఈ పని చేస్తున్నారు. ఇలాంటి స్పెర్మ్ డోనర్స్ గురించి ఎక్కడో చోటు వినే ఉంటారు. బాలీవుడ్ లో విక్కీ డోనర్ అనే సినిమా కూడా వచ్చింది.ఇక ఆస్ట్రేలియాకు చెందిన ఈ స్పెర్మ్ డోనర్ కథ కూడా చాలా విచిత్రమైంది. అందుకే అతను వార్తల్లో ఇప్పుడు నిలిచాడు. సోషల్ మీడియాలో కూడా అతను దుమ్మురేపుతున్నాడు. ఇక ఇంతకీ అతనేంటి? అతని కథేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ వ్యక్తి తన స్పెర్మ్ దానం చేసి 60 మంది పిల్లల జననానికి కారణం అయ్యాడు. స్పెర్మ్ దానం చేయడం ఈరోజుల్లో కామన్.. కానీ, పుట్టిన 60 మంది పిల్లలు కూడా అచ్చం అతని లాగే ఉన్నారట. అయితే, ఓ ఫంక్షన్‌కు కొంతమంది దంపతులు తమ పిల్లలతో సహా హాజరవగా.. వారి ముఖాలు ఒకేలాగా ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యారంతా. దాంతో మ్యాటర్ ఏంటని ఆరా తీస్తే.. ఈ స్పెర్మ్ దాత కథ బయటకొచ్చింది.ఈ వ్యక్తి LGBTQ+ కమ్యూనిటీలోని చాలా మంది సభ్యులకు తన స్పెర్మ్ ని దానం చేశాడట. వాస్తవానికి ఒక దాత స్పెర్మ్ కేవలం ఒకేసారి మాత్రమే ఉపయోగించాలనే నియమం ఉంది. కానీ, అతను మాత్రం వేర్వేరు పేర్లతో చాలా మందికి స్పెర్మ్ దానం చేసినట్లు ఇందులో తేలింది. అయితే ఈ విషయం ఎవరూ కనిపెట్టలేకపోయారు.కానీ నిజాన్ని ఎవరూ దాయలేరు.ఇక అతని స్పెర్మ్ కారణంగా పుట్టిన పిల్లలందరూ ఒకే రూపంలో ఉండటంతో ఇప్పుడు మ్యాటర్ రివీల్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: