ఆవుకి రెక్కలొచ్చాయా ఏంటి.. మరి ఇది ఎలా సాధ్యం?
ఇక ఇలా సోషల్ మీడియాలోకి వచ్చే కొన్ని వీడియోలు అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. అని చెప్పాలి. సాధారణంగా పశువులు నేలపై నడవడం మాత్రమే చూసాము. అయితే ఇక్కడ ఒక ఆవు మాత్రం ఏకంగా ఇంటి పైకి ఎగిరి ఇంటి పైకప్పు పై నడవడం మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోవడంతో ఇది ఎలా జరిగిందా అని నెటిజెన్స్ అందరు కూడా తలగోక్కుంటున్నారు అని చెప్పాలి.
వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక భారీ ఆవు ఏకంగా ఇంటి పై కప్పు పైకి ఎక్కి ఇక అక్కడ నడుస్తూ ఉంది. దీంతో అక్కడున్న ఒక వ్యక్తి ఇదంతా వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అయితే అసలు ఆ ఆవు ఇంటి పై కప్పు పైకి ఎలా ఎక్కిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇప్పటివరకు ఎన్నో రకాల అడవి జంతువులు కొండలపైకి ఎక్కడం చూసాము. కానీ ఇలా ఒక ఆవు ఇంటి పై కప్పు పైకి ఎక్కడా మాత్రం ఇదే మొదటిసారి చూస్తున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. పొరపాటున ఆవుకు ఏమైనా రెక్కలు వచ్చాయా ఏంటి అని మరి కొంతమంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.