
లైకుల కోసం పిచ్చి పని.. శోభనం వీడియో షేర్ చేశారు?
ఒక జంట ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక వీడియో కాస్త ఇంటర్నెట్ ను షేర్ చేస్తూ ఉండగా ఇక ఎంతోమంది నెటిజెన్స్ ఈ వీడియో పై విరుచుకుపడుతున్నారు అని చెప్పాలి. లైక్ల కోసం ఇంత దిగజారాలా అంటూ తిట్టిపోస్తూ ఉన్నారు. నాలుగు గోడల మధ్య రహస్యంగా భార్యాభర్తల మధ్య జరగాల్సిన విషయాన్ని సోషల్ మీడియాలోకి ఎక్కిస్తారా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలా నెటిజన్స్ అంతలా గరమ్ గరం కావడానికి కారణం ఏంటో తెలుసా.. ఏకంగా ఆ జంట వారి శోభనం రాత్రి వీడియోను సోషల్ మీడియాలో పెట్టడమే.
ఇక వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా శోభనం గదిలో వధూవరుల ఆహారంలో కనిపిస్తారు. ఇక కెమెరా ముందు ముద్దులతో రెచ్చిపోయి హగ్గులతో హీటెక్కి పోతూ ఉంటారు. తర్వాత వధువు ఆభరణాలు అలంకరణలు తీసేయడంలో వరుడు సహాయం చేస్తూ ఇక రొమాంటిక్ మూడ్లో ఊగిపోతూ ఉంటాడు. నిద్రమత్తులో ఉన్న నా భర్త శోభనం రోజు నాకెలా సహాయం చేశాడో చూడండి అంటూ ఇక వధువు ఒక కామెంట్ కూడా ఈ వీడియోకు జత చేసింది. ఇది చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. మీ పిచ్చి తగలెయ్య మరి శోభనం రాత్రి వీడియో షేర్ చేయడం ఏంటి అంటూ తిట్టిపోస్తున్నారు.