వైరల్ : అమ్మంటే అంతే.. ప్రాణాలు సైతం ఇచ్చేస్తుంది?
ఎందుకంటే తల్లి నవ మాసాలు మోసి పిల్లలకు జన్మనివ్వడమే కాదు ఏకంగా తన గర్భం నుంచి బయటికి వచ్చిన పిల్లలను కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటుంది. గోడుముద్దలు తినిపిస్తూ లాలి పాటలు పాడుతూ ఒడిలో నిద్రపుచ్చడమే కాదు ఏదైనా సమస్య వస్తే ఇక అపర కాలిలా మారిపోయి పిల్లలను రక్షించుకుంటుంది తల్లి. ఇలా ఏకంగా పిల్లలకు ప్రాణహాని ఉందని తెలిస్తే ఏకంగా తాను ప్రాణాలు అర్పించేందుకు కూడా సిద్ధమైపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇలా తల్లి ప్రేమను నిరూపించేందుకు ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఏకంగా ఒక మహిళ తన చిన్నారిని ఊయాలలో నిద్ర పుచ్చుతుంది. చిన్నారి లేవకుండా పాట కూడా పాడుతూ ఉంది. కానీ అంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక పెద్ద కొండచిలువ ఆ ఇంట్లోకి వచ్చింది. అయితే ముందుగా తల్లి ఆ పామును గమనించలేదు. కానీ ఇక తల్లి ఊయల నుంచి కిందకి దిగి ఆ ఊయలను ఊపుతున్న సమయంలో పాము ఒక్కసారిగా ఊయలను అందుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన తల్లి ఒకసారిగా భయాందోళనకు గురవుతుంది. వెంటనే తన ప్రాణాలకు తెగించి మరీ బిడ్డను ఆ ఊయల నుంచి తీసుకొని బయటకు పరుగులు పెడుతుంది. ఇక ఇది చూసిన ఎంతో మందిని అమ్మ అంటే అంతే.. పిల్లల కోసం ప్రాణాలకు తెగిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్లు.