జింకల ఆకలి తీర్చిన కోతి.. ఏం చేసిందో చూడండి?

frame జింకల ఆకలి తీర్చిన కోతి.. ఏం చేసిందో చూడండి?

praveen
సాధారణంగా అడవుల్లో ఉండే జంతువులు ఆహారం కోసం ఒక్కదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా పులులు సింహాలు ఏకంగా జింకలు సహా అడవుల్లో ఉండే అన్ని రకాల జంతువులను వేటాడి తనకు ఆహారంగా మార్చుకుంటూ ఉంటాయి. ఇలా వేటాడితేనే సింహాలు బతకగలవు. అయితే కొన్ని జంతువులు ఇలా వేటాడి ప్రాణాలు తీసి మరి ఆహారాన్ని సంపాదించుకుంటే మరికొన్ని జంతువులు మాత్రం జాతి వైరాన్ని మరిచి మరి వేరే జంతువులకు సహాయం చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి.


 ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నందా ఎప్పుడు ఎన్నో ఆసక్తికర వీడియోలని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అడవిలో  ఉండే జంతువుల జీవన శైలి ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పకనే చెబుతూ ఉంటారు. ఇకపోతే సుశాంత నంద ఒక ఆసక్తికర వీడియోని షేర్ చేయగా... అధిక కాస్త ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. ఏకంగా రెండు జింకలు ఒక కోతి గత కొంతకాలంగా ఎంతో సన్నిహితంగా ఉంటూన్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇది ఇక వైరల్ గా మారిపోయిన వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇక ఆహారం విషయంలో ఈ రెండు జాతులకు సంబంధించిన జంతువులు కూడా ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటూ ఉన్నాయి.


 సాదరణంగా జింకలు భూమి మీద దొరికే గడ్డితోపాటు ఇక చెట్ల ఆకుల్ని కూడా తిని కడుపు నింపుకుంటాయి అన్న విషయం తెలిసిందే. జింకలు చిన్నగానే ఉంటాయి. కాబట్టి ఇక చెట్ల కొమ్మలను అందుకోవడం కొన్ని కొన్ని సార్లు కష్టమవుతుంది. ఇటీవల చెట్ల కొమ్మలు తినాలి అని ఆశపడిన జింకలకు కోతి సహాయం చేసింది. ఏకంగా చెట్టు ఎక్కి ఇక చెట్టుకొమ్మలని కిందకు వచ్చింది. దీంతో జింకలు ఎంచక్కా ఆ చెట్టు కొమ్మలను తినేసాయి.  ఇక జింకలు ఆ చెట్టు కొమ్మకు ఉన్న ఆకులని తినేంతవరకు కూడా కోతి కొమ్మని వంచుతూనే ఉంది అని చెప్పాలి. ఇలా ఏకంగా కోతి ఎంతో తెలివిగా వ్యవహరించి జింకల ఆకలి తీర్చిన వీడియో కాస్త ట్విట్టర్ లో వైరల్ గా మారగా.. ఇది చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: