పక్షిలా గూడు కట్టుకున్న కింగ్ కోబ్రా.. వీడియో వైరల్?

praveen
ఈ భూమండలంపై ఎన్నో జీవరాసులు ఉన్నాయి. ఇక ఒక్కో జీవికి ప్రత్యేకమైన జీవనశైలి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని జీవుల జీవన శైలి చూసినప్పుడు అందరికీ ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి.  ఇక విష సర్పాలకు సంబంధించిన జీవన శైలి ఎప్పుడూ ప్రతి ఒక్కరు దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వసర్పాలలో అతి ప్రమాదకరమైన కోబ్రా ఏదైనా ఉంది అంటే వెంటనే కింగ్ కోబ్రా అని చెబుతూ ఉంటారు అందరూ.

 దీని విషం ఎంతో ప్రమాదకరమైనది అని చెప్పాలి. అదేవిధంగా దీని రూపం కూడా అంతే భయంకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు వరకు కింగ్ కోబ్రా ఎలా వేటాడుతుంది అన్న విషయాలను మాత్రమే సోషల్ మీడియాలో ఎన్నో వీడియోల ద్వారా అందరూ చూశామూ. కానీ కింగ్ కోబ్రా సైతం పక్షులు లాగానే ఒక గూడును కట్టుకుంటుంది అన్న విషయం చాలామందికి తెలియదు. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఇప్పుడు వరకు పక్షులు మాత్రమే చెట్లపై గూడును కట్టుకోవడం ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళినా చివరికి రాత్రి మాత్రం అదే గూడుకి వచ్చి నిద్రపోవడం లాంటివి చేస్తూ ఉంటాయి.

 కానీ ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియోలో చూస్తే మాత్రం ఏకంగా కింగ్ కోబ్రా చెట్ల ఆకులతో గూడుకట్టుకోవడం చూడవచ్చు. ఇక ముందుగా గూడు కట్టుకోవడం కోసం సరైన ప్రాంతాన్ని వెతికిన కింగ్ కోబ్రా చెట్ల పక్కన పల్లపు ప్రాంతాలను ఎంచుకుంటుంది. తర్వాత ఆకులు అలుములతో భూమి మీద గూడు కడుతుంది.  ఇలా కింగ్ కోబ్రా గూడు నిర్మించుకోవడం కోసం ఏడు నుంచి 14 రోజుల సమయం పడుతుందట. అంట ఇక ఈ గూడు పై సూర్య రష్మి  ఎక్కువ పడకుండా కింగ్ కోబ్రా జాగ్రత్త పడుతుందట. నీరు కూడా లోపలికి రాకుండా చూసుకుంటుందట. వర్షాకాలం ఎండాకాలంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా దృఢంగా ఈ గూడును నిర్మించుకుంటుందట కింగ్ కోబ్రా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: