సింహం నుంచి తప్పించుకున్న గేదె.. అంతలో ఊహించనీ ట్విస్ట్?
ఇక ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియోలో కూడా ఒక అడవి గేదకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని చెప్పాలి. ఏకంగా ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చెందంగా ఆ గేద పరిస్థితి మారిపోయింది. సాధారణంగా ఒక్కసారి సింహం కన్ను పడింది అంటే చాలు ఇక ఎంత భారీ జంతువు అయినా సరే దానికి ఆహారంగా మారిపోవాల్సిందే. ఎందుకంటే సింహం బలం ఆ రేంజ్ లో ఉంటుంది. ఇక ఇటీవల వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే పాపం సింహానికి ఎంత ఆకలేసిందో ఏమో ఏకంగా ఒక గేదెను వెంటాడటం మొదలుపెట్టింది. అయితే ఇది గమనించిన గేదె ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరిగెత్తింది.
ఎలాగైనా సింహం నుంచి తప్పించుకుని ప్రాణాలను కాపాడుకోవాలి అని భావించింది. ఈ క్రమంలోనే సింహం నుంచి తప్పించుకునేందుకు నది ప్రవాహం దాటేందుకు ప్రయత్నించింది. కానీ అంతలో మరో ఊహించని ప్రమాదం దూసుకు వచ్చింది. ఏకంగా నీళ్లలో ఉండే ముసలి ఇక ఆ గేదెపై దాడి చేసేందుకు వచ్చింది. దీంతో గేదె ప్రాణాలు గాల్లో కలిసి పోయినంత పని అయింది. ఇలా నీళ్లల్లోకి దిగిన గేదెపై ముసలి దాడి చేస్తూ ఉంటే అటు గట్టున ఉన్న సింహం మాత్రం చోద్యం చూస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇది చూసిన నేటిజన్లు ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.