వైరల్ : ఈ నేవీ అధికారి పాటకు.. ఫిదా అవ్వాల్సిందే?

praveen
ఎవరిలో ఎలాంటి టాలెంట్ దాగి ఉంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఎలాంటి ఉద్యోగం చేస్తున్న ఎలాంటి వృత్తిలో కొనసాగుతున్న కొంతమంది మాత్రం తమలో ఎవరికి ఊహకు అందని టాలెంట్ దాగి ఉంది అన్న విషయాన్ని అప్పుడప్పుడు బయట పెడుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొంతమంది పోలీస్ అధికారులు ఒకవైపు పోలీస్ వృత్తిలో కొనసాగుతూనే మరోవైపు ఏకంగా రోడ్డు మీద డ్యాన్సులు చేస్తూ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం లాంటి వీడియోలు ఇప్పటివరకు చాలానే వెలుగులోకి వచ్చాయి.


 మరికొంతమంది పోలీస్ అధికారులు ఏకంగా అదిరిపోయే పాట పాడుతూ అటు ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులందరికీ కూడా సరికొత్తగా అవగాహన కల్పించడం లాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. పోలీసులేంటి ఇంత అద్భుతంగా పాటలు పాడటం ఏంటి.. డాన్సులు చేయడం ఏంటి అని ఈ వీడియోలను చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే ఒక వీడియో ట్విట్టర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఏకంగా ఒక నేవీ అధికారి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ని పాడాడు. తన గాత్రంతో అందరిని ఫిదా చేసేస్తూ ఉన్నాడు.



 ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ గా నిలిచిన ఘర్సే నిఖాల్తే అనే పాటను నేవీ అధికారి అద్భుతంగా పాడిన ఒక వీడియో ట్విట్టర్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఏకంగా ఆ నేవి అధికారి ఈ పాటను ప్రాణం పెట్టి పాడాడు అని నటించనులను ఫిదా చేసేస్తుంది అని చెప్పాలి. ఇక ఇలా ఒక పాట పాడిన నేవీ అధికారి పేరు వైస్ అడ్మిరల్ గిరీష్ లూత్ర అని చెప్పాలి. ప్రస్తుతం ఆయన రిటైర్ అయ్యారు. ఇక ఇటీవల జరిగిన ఒక ఫంక్షన్ లో ఆయన తన గాత్రంతో అక్కడున్న వారందరినీ కూడా మైమరపింప చేసాడు అని చెప్పాలి. ఇక ఇది చూసి ఒక నేవీ అధికారిలో ఇంత గొప్ప టాలెంట్ ఉందా అని అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: