తిక్క కుదిరింది.. కొండచిలువతో ఆటలు.. కానీ చివరికి?
అయితే ఇక మనిషికి ఎంతో ప్రమాదకరమైన కొండచిలువల జోలికి వెళ్లడానికి ఎంతో మంది భయపడిపోతూ ఉంటే.. కొంతమంది మాత్రం ఏకంగా పెట్స్ లాగా వాటిని పెంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక వాటితో సరదాగా గడపడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి చూసినప్పుడు అందరూ ముక్కున వేలేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ కొండచిలువకు సంబంధించిన ఒక వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఇటీవల వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే నల్లటి కలర్ లో తల మీద తెల్లటి మచ్చలతో కొండచిలువ చూడటానికి ఎంతో భయంకరంగా ఉంది.
ఇక అలాంటి కొండచిలువతో ఒక యువకుడు ఆటలు ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలోనే ఆ కొండచిలువ తోకను పట్టుకున్నాడు. అయితే కొంచెం దూరంలో తల ఉంది. దీంతో అతడు కొండచిలువ అటూ ఇటూ కదులుతూ ఉంటే నవ్వుతూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు. కానీ ఒకసారిగా కొండచిలువ అతనికి మెడకు చుట్టుకోవడం మొదలుపెట్టింది. దీంతో అతనికి కాసేపు ఊపిరి ఆడలేదు. దీంతో ఒక్కసారిగా కంగారు పడిన యువకుడు మెల్లగా ఇక మెడకు చుట్టుకున్న పామును విడదీసేందుకు ప్రయత్నించాడు అని చెప్పాలి. ఇక ఇది చూసిన ఎంతోమంది నేటిజన్స్ షాక్ అవుతున్నారు.