తీయనైన గులాబ్ జామ్ ను.. యాక్ అనిపించేలా చేశాడు?
ఇలా కొంతమంది సోషల్ మీడియాలో పెట్టే వీడియోలు అయితే అందరిని అవ్వక్కయ్యేలా చేస్తూ ఉంటాయ్. ఎందుకంటే ఇలాంటి వంటకాన్ని మనుషులు ఎవరైనా తింటారా అని అనిపించేలా సరికొత్తగా ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. సాధారణంగా స్వీట్లు ఎక్కువగా ఇష్టపడేవారు గులాబ్ జామున్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే గులాబ్ జామ్ ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతూ ఉంటుంది.
అందుకే ప్రతి ఒక్కరు గులాబ్ జాము తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి గులాబ్ జామూ లాంటి ఒక నోరూరించే తీయటి పదార్థాన్ని అందరికి యాక్ అనిపించే విధంగా సరికొత్తగా ట్రై చేశాడు. ఈ క్రమంలోనే గులాబ్ జాములో తియ్యటి పానీయానికి బదులు ఏకంగా రమ్ కలిపి పారకం చేశాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. అయితే ఇలా చేసింది ఏకంగా ఒక క్లినికల్ న్యూట్రీషియనిస్ట్ కావడం గమనార్హం. ఇలాంటి వంటకాలు ఎవరైనా తింటారా అని నేటిజన్స్ ఇది చూసి యాక్ అనుకుంటున్నారు అని చెప్పాలి. పిచ్చి పీక్స్ లోకి వెళ్తే ఇలాగే ఉంటుందని మరి కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై మీరు ఏమనుకుంటున్నారు.